Begin typing your search above and press return to search.
హనీ ఈజ్ ది బెస్ట్.. ఇదిగోండి ప్రూఫ్!
By: Tupaki Desk | 21 Jan 2019 6:40 AM GMT'F2' లో ఆరడుగుల హీరోలైన వెంకటేష్.. వరుణ్ తేజ్ లను కాల్చుకుతినే పాత్రల్లో అందమైన హీరోయిన్లుగా తమన్నా.. మెహ్రీన్లు నటించారు. ఇద్దరిలో ముఖ్యంగా మెహ్రీన్ మెగా హీరో వరుణ్ తేజ్ కు చుక్కలు చూపిస్తుంది. హనీ ఈజ్ ది బెస్ట్ అని మాటిమాటికి అంటూ వరుణ్ ని సతాయిస్తుంది. 'హనీ ఈజ్ ది బెస్ట్' అనే సమయంలో ప్రత్యేకంగా ఒక మ్యానరిజంతో వరుణ్ ను ఫ్రస్ట్రేట్ చేస్తుంది. ఆడియన్స్ కు ఈ మ్యానరిజం సూపర్ గా కనెక్ట్ అయింది. అసలు ఈ మ్యానరిజం ఎక్కడినుంచి ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారో ఆ పాపను పరిచయం చేసింది మెహ్రీన్.
ఈమధ్య 'F2' సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ "నేను మీకు రియల్ హనీని పరిచయం చేయాలనుకుంటున్నాను. హనీ మ్యానరిజం ఈ అమ్మాయి నుంచే ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాము. హనీ.. ప్లీజ్ కమాన్ టు ది స్టేజ్. అనిల్ సర్ ప్లీజ్. మీరు కూడా" అంటూ ఇద్దరినీ స్టేజ్ మీదకు పిలించింది. వెంటనే దర్శకుడు అనిల్ రావిపూడి.. హనీ ఇద్దరూ స్టేజ్ మీదకు వచ్చారు.
మైక్ అందుకున్న అనిల్ రావిపూడి.."ఈ పాప పేరు హన్సిక. 'రాజా ది గ్రేట్' లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. రోజూ పొద్దున లొకేషన్ కు రాగానే 'గుడ్ మార్నింగ్ సర్' అని దగ్గరకు వచ్చేది. 'నీ పేరేంటమ్మా'.. అంటే 'హనీ' అనేది. హనీ అని జనరల్ గా చెప్పేది కాదు. ఇలా ప్రత్యేక మ్యానరిజం తో చెప్పేది" అంటూ చేసి చూపించాడు అనిల్. ఇప్పుడు ఒకసారి చెప్పు అని పాపను అడిగితే ఆ మ్యానరిజం చేసి చూపిస్తూ 'హనీ ఈజ్ ది బెస్ట్' అనే డైలాగ్ సూపర్ గా చెప్పింది. మెహ్రీన్ పాత్ర మ్యానరిజం కు ఈ పాపే ఇన్స్పిరేషన్ అంటూ అందరికీ పరిచయం చేశాడు అనిల్. మీరూ రియల్ హనీని ఒకసారి చూడండి.