Begin typing your search above and press return to search.

మనసు మార్చుకునే యోచనలో రాములమ్మ

By:  Tupaki Desk   |   6 March 2020 4:58 AM GMT
మనసు మార్చుకునే యోచనలో రాములమ్మ
X
సుదీర్ఘ కాలం తర్వాత విజయశాంతి ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో వెండి తెరపై కనిపించిన విషయం తెల్సిందే. మహేష్‌ బాబు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా రాములమ్మ నిలిచింది. సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తుందనే ఉద్దేశ్యం తో తమ సినిమాల్లో కీలక పాత్రల కోసం ఎంతో మంది దర్శక నిర్మాతలు ఇప్పటికే విజయశాంతిని కలవడం జరిగిందట. తన వద్దకు వస్తున్న దర్శక నిర్మాతలకు అడ్డు కట్టవేసేందుకు అని కొన్ని రోజుల క్రితం సినిమాల్లో తాను మళ్లీ నటించక పోవచ్చు అంటూ ట్వీట్‌ చేసింది.

ఇన్నాళ్లు ఆధరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అంటూ కాస్త ఎమోషనల్‌ ట్వీట్‌ చేసిన విజయశాంతి మళ్లీ సినిమాల్లో నటించక పోవచ్చు అంటూ చాలా క్లీయర్‌ గా చెప్పింది. కాని తాజాగా ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఆమె తన మనసును మార్చుకునే అవకాశం ఉందట. రెగ్యులర్‌ పాత్రలు కాకుండా కథలో కీలకమైన లేడీ రోల్స్‌ తో సంప్రదిస్తే తప్పకుండా నటిస్తాను అంటూ ఈ అమ్మడు చెబుతుందట. కర్తవ్యం లాంటి కథాంశం తో ఎవరైనా వస్తే నటిస్తానంటూ సన్నిహితుల వద్ద చెప్పిందట.

ఈ వయస్సులో లేడీ ఓరియంటెడ్‌ మూవీస్‌ అంటే సాహసమే. అలాంటి స్క్రిప్ట్‌ లతో మేకర్స్‌ ఆమెను సంప్రదించడం దాదాపు అసాధ్యం అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. కాని గతంలో ఎన్టీఆర్‌ చేసిన మేజర్‌ చంద్రకాంత్‌ లాంటి సినిమాలు లేడీ కాన్సెప్ట్‌ తో వస్తే విజయశాంతి చేసే అవకాశం ఉంది అంటున్నారు. మరి రాములమ్మను మళ్లీ సినిమాల్లోకి తీసుకు రాగల సత్తా ఉన్న ఆ దర్శకుడు ఎవరైనా ఉన్నారా అనేది చూడాలి. మనసుకు నచ్చిన కథ.. పాత్ర వస్తే మనసు మార్చుకునేందుకు రాములమ్మ సిద్దం.. మరి ఆమె మనసును మెప్పించే పాత్రలు మీ వద్ద ఉన్నాయా అయితే వెంటనే ఆమెను కలవండి.