Begin typing your search above and press return to search.

RRR 2.. ఆశలు రేపుతున్న జక్కన్న!

By:  Tupaki Desk   |   13 Nov 2022 4:49 AM GMT
RRR 2.. ఆశలు రేపుతున్న జక్కన్న!
X
దర్శక ధీరుడు రాజమౌళి ఏదైనా సినిమాను తెరపైకి తీసుకు వస్తున్నాడు అంటే దాని ఆలోచన మొదటి నుంచే కూడా జనాల్లో కూడా హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది. ఎలా ప్రమోట్ చేయాలో సినిమాను జనాల్లోకి ఎలా తీసుకువెళ్లాలో ఆయనకు తెలిసినట్లుగా మరే దర్శకుడికి తెలియదు అని చెప్పవచ్చు. ఆ విధంగా ఆలోచించే జక్కన్న గతంలో మహాభారతం సినిమాను తెరపైకి తీసుకు వస్తాను అని చెప్పి జనాల్లో భారీ ఆశలను రెపారు.

అయితే ఆ ప్రాజెక్టు మొదలుపెట్టడానికి మాత్రం ప్రస్తుతం తన అనుభవం సరిపోదు అని ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉంది అని చాలా సింపుల్ గా సమాధానం ఇచ్చాడు. అలాగే మరికొన్నిసార్లు తీయాలనే ఆలోచన ఉంది కానీ అది వెంటనే తీస్తాను అని నేను చెప్పలేదు అని కూడా జక్కన్న మరొక జలక్ అయితే ఇచ్చాడు.

అయితే ఇప్పుడు రాజమౌళి RRR సినిమాకు సంబంధించిన సీక్వెల్ పై ఆశలు రేపడం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల అమెరికాకు వెళ్లిన రాజమౌళి అక్కడ ఒక ఈవెంట్లో RRR సీక్వెల్ కు సంబంధించిన ఆలోచన చర్చల దశలో ఉంది అని భవిష్యత్తులో అది రావొచ్చు అని కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరినీ కూడా చాలా అద్భుతంగా చూపించిన రాజమౌళి సెకండ్ పార్ట్ లో ఏ విధంగా చూపిస్తాడు అనేది కూడా జనాల్లో మరింత ఆసక్తిని కలిగిస్తుంది.

అయితే ఆ ప్రాజెక్టు రావడానికి మాత్రం ఇంకా చాలా సమయం పట్టవచ్చు. ప్రస్తుతం రాజమౌళి పూర్తిస్థాయిలో మహేష్ బాబు సినిమా పై ఫోకస్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు కొనసాగుతున్నాయి. వచ్చే ఏడాది రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. అలాగే రాజమౌళి ప్రభాస్ తో కూడా ఒక సినిమా చేయాలని ముందుగానే అనుకున్నాడు. మరి RRR సినిమా సీక్వెల్ ఎప్పుడు తెరపైకి వస్తుందో చూడాలి.