Begin typing your search above and press return to search.
కేన్స్ స్పెషల్: చీరలోనే సిన్నమ్మలు
By: Tupaki Desk | 23 May 2015 3:30 PM GMTకేన్స్ చలనచిత్రోత్సవాలు ఆర్భాటంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో దేశ విదేశాల నుంచి తారకలంతా సందడి చేస్తున్నారు. ఇండియా నుంచి స్టార్‌లంతా వెళ్లారు. ఐశ్వర్యారాయ్ బచ్చన్, కత్రిన కైఫ్, మల్లిక శరావత్, విశాఖ సింగ్, నందితాదాస్, రిచా చద్దా, కాళేశ్వరి శ్రీనివాసన్.. ఇలా నాయికలంతా కేన్స్ రెడ్‌కార్పెట్‌పై సొగసుల్ని వడ్డిస్తున్నారు.
ఇటీవలే ఈ భామల్లో కొందరు అక్కడ చీరల్లో తళుక్కుమని భారతీయత గొప్పతనాన్ని చాటారు. వెండితో ధగధగలాడే జరీ అంచు పట్టు చీరల్లో తళతళలాడిపోయారు. రౌడీ ఫెలో ఫేం విశాఖ సింగ్ పింకు రంగు డిజైన్డ్ శారీలో తళుక్కుమంది. ఈ భామ కేన్స్ స్క్రీనింగ్ కమిటీలో ఒకానొక సభ్యురాలిగా కొనసాగుతోంది. అలాగే నందితాదాస్ బంగారు వర్ణం చీరకట్టి కాంబినేషన్ హ్యాండ్ బ్యాగ్‌తో తళుక్కుమనిపించింద. అంతేనా ఫ్యాషన్‌కే ఫ్యాషన్ స్టయిలిస్ట్ రీచా చద్దా తనకంటూ ఓ ప్రత్యేకమైన రూపాన్ని రెడీ చేసుకుని కేన్స్‌లో సందడి చేసింది. ఒక ప్రత్యేకమైన లేత పచ్చ రంగు చీరపై గులాబీల డిజైన్ ఉన్న శారీలో తళుక్కుమంది.
శ్రీలంక వలసకారుల కథాంశంతో తెరకెక్కించిన దీపన్ అనే సినిమాని స్క్రీనింగ్ చేసేందుకు విచ్చేసిన కాళేశ్వరి శ్రీనివాసన్ బులుగు రంగు పట్టు చీరలో తళుక్కుమన్నారు. ఇలా కేన్స్ సంబరాల్లో మనదైన చీర డామినేషన్ కొనసాగింది. పట్టు చీరే, సిల్కు సీరే.. కట్టేసుకున్నాది సిన్నమ్మే అని పాడుకున్నారంతా.