Begin typing your search above and press return to search.

దెయ్యం పాత్ర‌లు ఆ భామ‌లిద్ద‌రికి క‌లిసొచ్చేనా?

By:  Tupaki Desk   |   28 Jun 2023 7:00 AM
దెయ్యం పాత్ర‌లు ఆ భామ‌లిద్ద‌రికి క‌లిసొచ్చేనా?
X
చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపోతుంది. స్టార్ హీరోల చిత్రాల్లో అవ‌కాశాలు అందుకుంటూ న‌వ నాయిక‌ల‌కు త‌క్కువేం కాదంటోంది. అయితే ఈ ఫేజ్ లో కాజ‌ల్ టార్గెట్ హీరోల‌తో రొమాన్స్ కాదు. సోలోగా బాక్సాఫీస్ వ‌ద్ద స‌త్తాచాటాల‌న్న‌ది అమ్మ‌డి ప్లాన్.

ఆ దిశ‌గా ఇప్ప‌టికే కొన్ని హార‌ర్ థ్రిల్ల‌ర్ సినిమాలు చేసింది. 'ఘోస్టీ'..'క‌రుంగాప్పియం'లాంటి హార‌ర్ సినిమాల్లో మెయిన్ లీడ్ పోషించింది. కానీ ఇవి కాజ‌ల్ కి స‌రైన విజ‌యాలు అందించ‌లేదు. అయినా ఆ తర‌హా అవ‌కాశాల్ని విడిచిపెట్ట‌డం లేదు.

ఫేమ్ లో ఉన్న‌ప్పుడు సోలోగానూ స‌త్తా చాటుతాన‌ని వచ్చిన చిన్న సినిమాల‌కు సైతం సైన్ చేస్తుంది. అలాగే త‌మిళ సోయ‌గం రెజీనా క‌సాండ్రా కూడా జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా కెరీర్ ని కొన‌సాగిస్తుంది.

కోలీవుడ్ లో కొన్నిహార‌ర్ సినిమాలు చేసింది. తాజాగా ఈ భామ‌లిద్ద‌రు ఒకే ప్రేమ్ లో 'కురుంగాపియం 'అనే హార‌ర్ సినిమా చేస్తున్నారు. ఇద్ద‌ర్నీ మెయిన్ లీడ్ కి ఎంపిక చేసి కార్తికేయ‌న్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. తెలుగులో ఈ సినిమా 'కార్తిక' టైటిల్ తో అనువాద‌మ‌వుతుంది.

తాజాగా ఈ సినిమా వివ‌రాల్ని యూనిట్ రివీల్ చేసింది. ఐదు పాత్ర‌ల చుట్టూ క‌థ న‌డుస్తుందిట‌. రెజీనా ఓ లైబ్ర‌రీకి వెళ్లి 100 ఏళ్ల క్రితం నాటి 'కాటుక‌బొట్టు' అనే ఓ పుస్త‌కం చ‌దువ‌తుందిట‌.

ఆమె ఆ పుస్త‌కం చ‌దివుతున్న స‌మ‌యంలో అందులో పాత్ర‌లు దెయ్యం రూపంలో ప్ర‌త్య‌క్ష‌మ‌వుతాయట‌. అలాగే కాజ‌ల్ కూడా దెయ్యం పాత్ర‌లో మారిపోతుందిట‌. ప‌గ‌ప్రతీకారంతో రగిలిపోయే దెయ్యం పాత్ర‌లోకి కాజ‌ల్ క‌నిపించ‌నుందిట‌.

అయితే ఆ పుస్త‌కం చ‌దివిన రెజీనా దెయ్యంగా మారిందా? లేదా? అన్న‌ది స‌స్పెన్స్. కొన్ని వాస్త‌వ సంఘ‌ట ల‌ను కూడా ఈ సినిమాకి స్పూర్తి అని తెలిసింది. మొత్తానికి 'కార్తిక' తో కాజల్..రెజీనా మ‌రోసారి దెయ్యం పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నార‌ని తెలుస్తోంది.

ఈ సినిమా అయినా ఇద్ద‌రికీ మంచి పేరు తెస్తుందా? అన్న‌ది చూడాలి. కాజ‌ల్ ఈ సినిమాతో పాటు 'స‌త్య‌భామ' అనే మ‌రో లేడీ ఓరియేంటెడ్ సినిమా కూడా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. అలాగే 'భ‌గ‌వంత్ కేస‌రి'లో న‌ట‌సింహం బాల‌య్య తోనూ రొమాన్స్ చేస్తుంది.