Begin typing your search above and press return to search.

న్యూడ్ క్లిప్స్ బాగా ఇబ్బంది పెట్టాయంటున్న హాట్ బ్యూటీ..!

By:  Tupaki Desk   |   21 May 2021 12:30 PM GMT
న్యూడ్ క్లిప్స్ బాగా ఇబ్బంది పెట్టాయంటున్న హాట్ బ్యూటీ..!
X
బాలీవుడ్ హాట్ బ్యూటీ రాధికా ఆప్టే గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. వివాదాలను వెంటేసుకుని తిరిగే హీరోయిన్లలో ఈమె ఒకరు. ఇక ఏదైనా సరే బోల్డ్‌ గా చేయడమే ఈ భామకు అలవాటు. ఆన్ స్క్రీన్ లో నటించినా ఆఫ్ స్క్రీన్ లో మాట్లాడినా అంతే. తెరపై ఎంత బోల్డ్‌ గా నటిస్తుందో.. సోషల్ మీడియాలో అంతకు మించి హాట్‌ గా కనిపిస్తుంది. ప్రస్తుతం ఒరిజినల్ మూవీస్ - వెబ్ సిరీస్‌ లతో బిజీగా మారిన రాధిక.. అప్పట్లో 'క్లీన్ షేవెన్' అనే షార్ట్ ఫిలిం కోసం న్యూడ్ గా కనిపించి సంచలనం రేపింది. దీనికి సంబంధించిన క్లిప్స్ లీక్ కాబడి నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి.

దీంతో రాధిక ఆప్టే న్యూడ్ గా నటించడంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సోషల్ మీడియాలో ఆమెపై నెగిటివ్ కామెంట్స్ పెట్టారు. అయితే రాధిక స్వభావం తెలిసిన వాళ్ళు, ఆమె ఈ విషయాన్ని అసలు పట్టించుకొని ఉండరు అనుకున్నారు. కానీ ఆ న్యూడ్ క్లిప్స్ లీక్ అవడం వల్ల జరిగిన పరిణామాలు తనను ఇబ్బంది పెట్టినట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆప్టే వెల్లడించారు. అప్పుడు మీడియా సోషల్ మీడియాలలో తన గురించి ఏమంటున్నారనేది పెద్దగా పట్టించుకోలేదని.. కానీ తన చుట్టూ ఉన్న వాళ్ళు అదో రకంగా చూడటం వల్ల ఇబ్బందికి గురయ్యానని రాధిక తెలిపింది.

లీకైన వీడియోలో ఉన్నది తానే అని గుర్తించిన వాచ్‌ మ్యాన్ - డ్రైవర్ వంటి వారు తనవైపు అదోలా చూశారని.. వాళ్లను ఫేస్ చేయలేక నాలుగైదు రోజుల పాటు ఇంటికే పరిమితం అయ్యానని రాధిక ఆప్టే చెప్పుకొచ్చారు. ఆ తర్వాత 'పార్చ్డ్' సినిమా కోసం బోల్డ్‌ గా పూర్తి నగ్నంగా కనిపించానని.. ఆ పాత్ర చేశాక తనలో ధైర్యం వచ్చిందని చెప్పింది. అప్పటి నుంచి దాచుకోవడానికి ఏమీ లేదనే అభిప్రాయానికి వచ్చి ధైర్యంగా ఉంటున్నానని రాధికా ఆప్టే చెప్పారు.

కాగా, రాధికా ఆప్టే బిగ్ స్క్రీన్ పై కంటే స్మాల్ స్క్రీన్ పైనే ఎక్కువగా ఫేమస్ అయింది. తెలుగు తమిళం హిందీ బెంగాలీ మరాఠీలతో పాటు ఇంగ్లీష్ భాషలో కూడా నటించింది. తెలుగులో 'రక్తచరిత్ర' 'ధోని' 'రక్తచరిత్ర 2' 'లెజెండ్' 'లయన్' 'కబాలి' వంటి సినిమాల్లో నటించి ఇక్కడి ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. ప్రస్తుతం ఓటీటీ వరల్డ్ లో సత్తా చాటుతోందీ బ్యూటీ. ఈ నేపథ్యంలో గతేడాది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బ్రాండ్స్ సంస్థ ''క్వీన్ ఆఫ్ ఓటీటీ''గా రాధికా ఆప్టే ను గుర్తించారు.