Begin typing your search above and press return to search.

అన్ కంట్రోల్ గా లాగించేసే హాట్ హీరోయిన్!

By:  Tupaki Desk   |   8 May 2022 2:30 AM GMT
అన్ కంట్రోల్ గా లాగించేసే హాట్ హీరోయిన్!
X
ముంబై బ్యూటీ శ్ర‌ద్దా దాస్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితురాలే. 'ఆర్య‌-2' తో ఫేమ‌స్ అయిన అమ్మ‌డు అటుపై చాలా సినిమాల్లో న‌టించింది. మీడియం రేంజ్ హీరోల‌కు జోడీగా కొన్ని సినిమాల్లో బిగ్ స్టార్స్ చిత్రాల్లో సెకెండ్ లీడ్స్ లోనూ న‌టించింది. కానీ శ్ర‌ద్ద కెరీర్ టాలీవుడ్ లో ఆశించినంత గొప్ప‌గా సాగ‌లేదు. గ్లామ‌ర్ ఎలివేష‌న్స్ ఇచ్చినా టాలీవుడ్ ఆడియ‌న్స్ కి రుచించ‌లేదు.

అలా టాలీవుడ్ కి దూర‌మైన క‌న్న‌డ‌...హిందీ భాష‌ల్లో కొన్ని సినిమాలు చేసింది. అక్క‌డా అదే ప‌రిస్థితి. శ్ర‌ద్దా దాస్ న‌టించిన‌ సినిమా విడుద‌లై ఇప్ప‌టికి మూడు సంవ‌త్స‌రాలు అవుతుంది. అయితే మ‌ళ్లీ 'లేచింది మ‌హిళా లోకం' అనే ఓ తెలుగు సినిమా లో న‌టిస్తుంది . ఇందులో అమ్మ‌డి పాత్ర న‌లుగురితో నారాయ‌ణ కులంతో గోవింద అన్న త‌ర‌హాలో ఉంటుంద‌ని తెలుస్తోంది.

ఇందులో మంచు ల‌క్ష్మి..పార్వ‌తి నాయర్.. అశురెడ్డి..హ‌రి తేజ స‌హా కొంత మంది న‌టిస్తున్నారు. అంద‌రి పాత్ర‌లు స‌మాన‌మే. త్వ‌ర‌లోనే సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో భాగంగా ఓ పోస్ట్ ని షేర్ చేసింది శ్ర‌ద్ధా దాస్. 'బులిమియా నెర్వోసా' తో చేసిన యుద్దం గురించి చెప్పుకొచ్చింది. బులిమియా తీవ్ర‌మైన తిండి రుగ్మ‌త గ‌ల జ‌బ్బు.

బులిమియా ఉన్న వారు ఆహరంపై నియంత్ర‌ణ లేకుండా తింటారు. పీక‌లు దాకా తిన్న త‌ర్వాత కూడా ఇంకా తినాల‌ని కోరిక పుడుతుందిట‌. న‌లుగురు చూస్తార‌నే భావ‌న‌తో ర‌హ‌స్యంగా ప‌క్క‌కి సైతం వెళ్లి తినేంత‌గా తిండి ప్రేరేపిస్తుందిట‌. ఇలాంటి వారికి మూత్ర‌..మ‌ల విస‌ర్జ‌న స‌రిగా జ‌ర‌గ‌దు. వాంతులు..విరేచ‌నాల బారిన ప‌డ‌తారు. ఎనిమీయా ద్వారా మల విస‌ర్జ‌న చేయాల్సి ఉంటుంది.

ఈ జ‌బ్బు బారిన శ్ర‌ద్దాదాస్ కూడా ప‌డింది. కాలేజ్ డేస్ లో ఆంటీలా ఉండేద‌ట‌. స్నేహితులంతా అమెని ఆంటీని అని పిలిచేవారుట‌. చాలా మంది ఎంతో హేళ‌న చేసేవారుట‌. దీంతో మ‌న‌సులో చాలా కుమిలిపోయేదాన్ని అని ఓ స‌మ‌యంలో ఈ విష‌యం ప్రిన్స్ పాల్ దృష్టికి సైతం తీసుకెళ్లింద‌ని తెలిపింది. బాడీ షేమింగ్ త‌న‌పై తీవ్ర ప్రభావం చూపింద‌ని.. దీంతో తిండిని క‌ట్ట‌డి చేసిన‌ట్లు తెలిపింది.

ఆ స‌మ‌యంలో నోరు క‌ట్టుకోవ‌డం చాలా ఇబ్బంది ఉంటుంద‌ని...అందుకోసం చాలా క‌స‌ర‌త్తులే చేసిన‌ట్లు తెలిపింది. స‌న్న‌బ‌డ‌టం రెండేళ్ల పాటు తిపి సున్నం తిన్నాను. దీని వ‌ల్ల ఆరోగ్య ప‌రంగా కొన్ని స‌మ‌స్య‌లు వ‌స్తాయి. కానీ ప‌రిస్థితులు డిమాండ్ చేయ‌డంతో త‌ప్ప‌లేద‌ని తెలిపింది. శ్రద్ద త‌న బాడీషేమింగ్ సీక్రెట్ చెప్పి అలాంటి వారు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని అవేర్ నెస్ తెచ్చేలా చ‌క్క‌గా ఓపెన్ అయింది. బ‌రువు త‌గ్గించుకోవ‌డం అన్న‌ది పెద్ద విష‌యం కాదు కృషి ఉంటే ఏదైనా సాధ్య‌మేన‌న‌డానికి మ‌రోక ఉదాహ‌ర‌ణ‌గా శ్ర‌ద్దాని చెప్పుకోవ‌చ్చు.