Begin typing your search above and press return to search.
హాట్ మహిమా చౌదరి వారసురాలు బరిలోకి!
By: Tupaki Desk | 1 Jun 2022 4:29 AM GMTఅన్ని పరిశ్రమల్లోనూ నటవారసుల వెల్లువ కొనసాగుతోంది. శ్రీదేవి- షారూక్ ఖాన్ - అమితాబ్ బచ్చన్- సైఫ్ ఖాన్ వంటి అగ్రతారల కుటుంబాల నుంచి వరుసగా నటవారసులు బరిలో దిగుతున్నారు. ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ మహిమా చౌదరి కుటుంబం నుంచి నటవారసురాలు బరిలోకి దిగుతోందన్న గుసగుస వినిపిస్తోంది. యుక్తవయసులో ఉన్న మహిమా కుమార్తె అరియానా ముఖర్జీపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తుననారు. "క్యూట్ బ్యూటీ తన తల్లికి కచ్చితమైన ప్రతిరూపం" అంటూ పొగిడేస్తున్నారు.
మహిమా చౌదరి షోబిజ్ లో యాక్టివ్ గా ఉండకపోవచ్చు కానీ ఆమె తన ఇన్ స్టా ఫ్యామ్ లో తన జీవితం గురించి అప్ డేట్స్ తో అభిమానులకు టచ్ లో ఉంది. మాజీ నటి తన టీనేజ్ కుమార్తె అరియానా ముఖర్జీతో కలిసి ఉన్న వీడియోలను తరచుగా షేర్ చేస్తోంది. నెటిజనుల స్పందనలు అనూహ్యం. తల్లీ-కూతుళ్ల మధ్య ఉన్న అద్భుతమైన పోలికను నెటిజనులు గుర్తు చేస్తున్నారు.
మహిమా - అరియానా జోడీ ఇటీవలి కొన్ని వీడియోలను షేర్ చేయగా వాటికి అభిమానులు చేసిన కొన్ని వ్యాఖ్యలు పరిశీలిస్తే.."కుమార్తె సరిగ్గా తన తల్లి లా ఉంది. కానీ ఆమె వయస్సు కంటే ఎక్కువ పరిణతి చెందింది" అని "వావ్ యుర్ డాటర్ లుక్స్ లాగా యు...." అని ఒకరు.. 'తల్లి ప్రతిరూపం' అని మరొకరు వ్యాఖ్యానించారు. త్వరలోనే అరియానా సినిమాల్లోకి రావాలని చాలామంది అభిమానులు కోరుకున్నారు.
మోడల్ .. మాజీ మిస్ ఇండియా.. బాలీవుడ్ నటి మహిమా చౌదరి పరిచయం అవసరం లేదు. మనసులో మాట అనే చిత్రంలో నటించింది. అందానికి అందం ప్రతిభతో ఆకట్టుకున్న ఈ నటి అనంతర కాలంలో బాలీవుడ్ లోనే సెటిలైంది. చిరంజీవి - రజనీలను విపరీతంగా అభిమానించే నటీమణుల్లో మహిమ పేరు ఉంది. ఇక సినిమాలతో కంటే ఎఫైర్ తోనే ఈ అమ్మడి పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది.
ప్రఖ్యాత టెన్నిస్ ఆటగాడు... లియాండర్ పేస్ తో సుదీర్ఘ కాలం ప్రేమాయణం సాగించి చివరికి బ్రేకప్ అయిన వైనం అభిమానుల్లో హాట్ టాపిక్ అయ్యింది అప్పట్లో. లియాండర్ తనను మోసం చేశాడని వేరొకరితో కులుకుతూ తనను వదిలించుకున్నాడని పలుమార్లు బహిరంగ వేదికలపైనే మహిమ వాపోయింది. రియా పిళ్ళై అనే వేరొక యువతిని పెళ్లాడి తనని మోసం చేశాడని లియాండర్ పై పలుమార్లు విరుచుకుపడింది. కారణం ఏదైనా వ్యక్తిగత జీవితంలో కల్లోలం సినీకెరీర్ పైనా పడింది. అప్పట్లో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగీ కెరీర్ పరంగా చివరికి జీరో అయిపోయింది.
మహిమా 2006 లో ఆర్కిటెక్ట్ కం వ్యాపారవేత్త బాబీ ముఖర్జీని వివాహం చేసుకుంది. ఈ జంటకు జన్మించిన అందమైన కుమార్తె అరియానా. అయితే విభేదాల కారణంగా ఆ జోడీ 2011 లో విడిపోయారు. అయితే అప్పటికే మహిమా లియాండర్ పేస్ తో ఎఫైర్ సాగించిందన్న ప్రచారం ఉంది. అనంతర కాలంలో ఓ ఇంటర్వ్యూలో మహిమ మాట్లాడుతూ-"లియాండర్ మంచి టెన్నిస్ ప్లేయర్ కావచ్చు.. కానీ అతను నాతో ఫెయిర్ గేమ్ ఆడలేదు. అతను వేరొకరి(మోడల్ రియా)తో షికార్లు చేస్తున్నాడని తెలిసినప్పుడు నిజంగా షాక్ తగల్లేదు.. అతడు అంతే. నా జీవితం నుంచి అతడి నిష్క్రమణ నాపై ఎలాంటి ప్రభావం చూపలేదు. వాస్తవానికి నేను ఒక వ్యక్తిగా మరింత పరిణతి చెందాను. అతను రియా (పిళ్ళై) తో కూడా అదే పని చేశాడని నేను భావిస్తున్నాను" అని తెలిపింది. అనంతర కాలంలోనే రియా నుంచి లియాండర్ విడిపోయాడు. ఇది చాలా వరస్ట్ బ్రేక్-అప్ లలో ఒకటిగా నిలిచిపోయింది. లియాండర్ తాను రియాను ఎప్పుడూ వివాహం చేసుకోలేదని వాదిస్తే.. తాను మాత్రం ఓ హిందూ దేవాలయంలో వివాహం చేసుకున్నారని రియా వాదించింది.
కారణం ఏదైనా అనంతర కాలంలో మహిమాకు ఇండస్ట్రీలోనూ సత్సంబంధాలు దెబ్బ తిన్నాయి. తనను పరిశ్రమకు తీసుకువచ్చిన సుభాష్ ఘాయ్.. ఆమె పేరు మార్పు చేయడమే గాక.. రాబోయే కొన్ని తరాల పాటు ప్రజలు తనను గుర్తుంచుకునేంతటి గొప్ప సినిమాని చేసే అవకాశం ఇచ్చారు. అయితే అందుకు మహిమా ఒకానొక సందర్భంలో మూల్యం చెల్లించాల్సి వచ్చింది. మహిమ సంపాదనలో 35 శాతం తనకు చెందిన ఓ ట్రస్ట్ కి అందేలా సుభాష్ ఘాయ్ ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఆ విషయంలో మహిమ మాటపై నిలబడలేదన్న ఆరోపణలు ఎదుర్కొంది. కోర్టుల వరకూ గొడవ వెళ్లినా.. ఆ తర్వాత సెటిల్ చేసుకున్నారు. అలా తనకు తొలి ఆఫర్ ఇచ్చిన గురువుతోనూ మహిమ గొడవకు దిగడం సంచలనమైంది.