Begin typing your search above and press return to search.
వీడియో టాక్: వెండితెరను హీటిక్కించారుగా..
By: Tupaki Desk | 13 Feb 2018 6:50 PM GMTప్రేమంటే ఓ అద్భుతమైన అనుభవం. ఓ అంతులేని కావ్యం. చూపుల్తో గుండె లోతుల్లో కొలువుండిపోయే ప్రేమ కథలు ఎన్ని చెప్పినా ఇంకా కొత్తగానే ఉంటుంది. ప్రియురాలి ఓరకంట చూపు చాలు పేజీలకు పేజీలు కవిత్వం రాసేయడానికి.. అందుకే వెండితెరపై ఎన్నో ప్రణయ గాథలు దృశ్యకావ్యాలుగా మిగిలిపోయాయి. కానీ ఈ మధ్య బాలీవుడ్ వెండితెరపై ప్రణయం కొంచెం పక్కదారి పట్టింది. శృంగారం శృతిమించింది.
ప్రేమే కాదు.. ప్రేమ మిగిల్చే వేదన మరిచిపోలేనిదే. ఇదే కాన్సెప్ట్ తో బాలీవుడ్ లో హేట్ స్టోరీ సిరీస్ లో సినిమాలు వచ్చాయి. ఇప్పటికి మూడు రాగా.. ఇప్పుడు నాలుగో పార్ట్ వస్తోంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఇందులోని రొమాంటిక్ సాంగ్ ను కాస్త ముందుగానే విడుదల చేశారు. వివాన్ భట్నా.. ఇహానా థిల్లాన్ జంటగా ‘తుమ్ మేరా హో’ అంటూ సాగే ఈ పాట చూసేవారికి సెగలు పుట్టించేలా ఉంది. అధర చుంబనాలు... కౌగిలింతలు దాటి ఈ పాట ఎక్కడికో వెళ్లిపోయింది. ఇందులోని హీరోయిన్ ఇహానా థిల్లాన్ ఎక్స్ పోజింగ్ లో ఇప్పటిదాకా ఉన్న సరిహద్దులన్నీ దాటేసింది. అస్సలు అందాలను ఏ మాత్రం దాచలేని బ్లాక్ బ్రా తో అమ్మడు విరహం ప్రదర్శించిన తీరు చూస్తే మన్మథుడికే మతి చెడిపోతుందంటే ఎంతమాత్రమూ అబద్ధం కాదు.
ప్రణయానికి.. శృంగారానికి.. కామానికి కాస్తంతే తేడా ఉంటుంది. కానీ హేట్ స్టోరీ-4 ఈ తేడాలన్నింటినీ దాటేశారు. పాట వినసొంపుగా ఉన్నా చూపరుల ఫోకస్ ఎక్కడా దానిమీద ఉండకుండా ఇంకెక్కడో ఉంటుందంటే.. అది చూసేవాళ్ల తప్పు ఎంతమాత్రమూ కాదు. సింపుల్ గా చెప్పాలంటే కామాతురాణం నభయం.. నహేట్ స్టోరీ-4