Begin typing your search above and press return to search.

అనిరుద్ తో హాట్ స్టార్ బిగ్ ప్లాన్!

By:  Tupaki Desk   |   19 Aug 2022 9:30 AM GMT
అనిరుద్ తో హాట్ స్టార్ బిగ్ ప్లాన్!
X
సౌత్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం తీరిక లేకుండా ఎక్కువ సినిమాలతో కొనసాగుతున్న సంగీత దర్శకులలో అనిరుద్ రవిచందర్ ఒకరు. అతను ఎలాంటి సినిమా చేసిన కూడా కంటెంట్ కు తగ్గట్టుగా మ్యూజిక్ చేస్తాడు అనే గుర్తింపును అందుకున్నాడు.

సీనియర్ హీరోల నుంచి నేటితరం యువ హీరోలు అందరూ కూడా ఈ యువ సంగీత దర్శకుడితో మ్యూజిక్ చేయించుకోవాలని కూడా ఆశపడుతున్నారు. ఇక దర్శకుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక్కసారి అనిరుద్ తో పరిచయం ఏర్పడింది అంటే మళ్ళీ అతన్నే కంటిన్యూగా కొనసాగిస్తున్నారు.

ఒక విధంగా చాలామంది అగ్ర దర్శకులకు అతను ఇప్పుడు ఆస్థానా సంగీత దర్శకుడిగా మారిపోయాడు. అయితే అతని స్టార్ హోదాను ఉపయోగించుకునేందుకు కొన్ని ఓటీటీ సంస్థలు కూడా పోటీపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఓటిటి ప్లాట్ ఫామ్ లో అగ్రగామి సంస్థల్లో ఒకటైన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కూడా అనిరుద్ రవిచందర్ తో ఇటీవల ఒక డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం.

త్వరలోనే ఈ సంగతి దర్శకుడితో ఒక భారీ మ్యూజికల్ ఈవెంట్ నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు ఇండియాలో ఎవరు కూడా చేయని విధంగా ఆ మ్యూజికల్ ఈవెంట్ ఉండబోతుందట. అందుకోసం అనిరుద్ కూడా ప్రత్యేకంగా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈవెంట్ కోసం కూడా అతనికి భారీ స్థాయిలో అమౌంట్ కూడా ముద్ద చెప్పినట్లు సమాచారం. రీసెంట్గా ఒక ప్రత్యేకమైన అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు.

"రాక్ స్టార్ ఆన్ హాట్ స్టార్" అంటూ హాట్ స్టార్ సోషల్ మీడియా ద్వారా క్లారిటీ అయితే ఇచ్చింది. ఆ ప్రత్యేకమైన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటున్నా అనిరుద్ ఈ తరహాలో మళ్లీ జనాలకు సరికొత్తగా అట్రాక్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.

ఇక తెలుగులో కూడా అతను ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాకు సంగీతం అందించబోతున్న విషయం తెలిసిందే. అలాగే రజినీకాంత్ తదుపరి సినిమాకు కూడా అనిరుధ్ మ్యూజిక్ అందించబోతున్నాడు.