Begin typing your search above and press return to search.
హాట్ టాపిక్ అయిన సరిలేరు డైలాగ్స్
By: Tupaki Desk | 23 Nov 2019 10:49 AM GMTహాలీవుడ్ హీరోలు జస్ట్ యాక్షన్ చేస్తారు.. ఎపుడో ఒకసారి గానీ పంచ్ డైలాగ్స్ చెప్పరు. మన లాగా వాటిని పంచ్ డైలాగ్స్ అనరు.. వాటిని 'వన్ లైనర్స్' అనే పేరుతో పిలుస్తారు. కానీ మన టాలీవుడ్ సినిమాలో పంచ్ డైలాగ్స్ లేకపోతే ఆ సినిమాను ఉప్పులేని పప్పు.. మసాలా లేని బిర్యానికింద జమకడతారు ప్రేక్షకులు. అందుకే స్టార్ హీరోల సినిమాల్లో పంచ్ డైలాగ్స్ మోత మోగిపోతుంది. సినిమాలో ఏం ఖర్మ.. జస్ట్ టీజర్ లోనే మూడు నాలుగు పంచ్ డైలాగ్స్ ఉంటాయి. నిన్న శుక్రవారం విడుదలైన మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' టీజర్ లో పంచ్ ల పండగ జరిగింది.
"భయపడేవాడే బేరానికి వస్తాడు.. మన దగ్గర బేరాలు లేవమ్మా" అంటూ కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర మహేష్ బిగ్గరగా చెప్పే డైలాగ్ మాసుకు.. క్లాసుకు వెంటనే కనెక్ట్ అయిపోయింది. అయితే సినిమాను నిజ జీవితంలోని పరిస్థితులతో పోల్చి చూడడం సహజం కాబట్టి మహేష్ ఫ్యాన్స్ ఈ డైలాగ్.. సంక్రాంతి పోటీలో ఉన్న 'అల వైకుంఠపురములో' టీమ్ కు ఇచ్చిన పంచ్ గా భావిస్తున్నారు. 'సరిలేరు నీకెవ్వరు'.. 'అల వైకుంఠపురములో' సినిమాలు ఒకే విడుదల తేదీని ప్రకటించడం.. తీవ్రమైన పోటీ నెలకొనడం తెలిసిన విషయాలే. అయితే మహేష్ సినిమాను ఫైనల్ గా ఒకరోజు ముందుకు జరిపి 11 న రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. అయితే దీంతో సంబంధం లేకుండా 'బేరల్లేవమ్మా' డైలాగ్ విడుదల డేట్ చర్చలకు.. బేర సారాలకు సంబంధించినదేనేని ఫ్యాన్స్ అభిప్రాయం.
ఇక టీజర్ లో మరో డైలాగ్ కూడా వివాదంగా మారుతోంది. "ప్రతి సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు.. ఈ సంక్రాంతికి మొగుడు వచ్చాడు" అంటూ ప్రకాష్ రాజ్ చెప్పిన డైలాగ్ మహేష్ ను ఉద్దేశించినదే అయినా అది "ఎంతమంది అల్లుళ్ళు వచ్చినా ఈసారి సంక్రాంతి బాక్స్ ఆఫీస్ కు మహేష్ మొగుడు" అని ముందే ప్రకటించినట్టుగా ఉంది. ఇది కూడా ఫ్యాన్స్ ఇతర సినిమాలకు మహేష్ టీమ్ ఇచ్చిన పంచ్ అని భావిస్తున్నారు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చాలామంది ఇదే అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. అయితే కొందరు మాత్రం ఈ పంచులు అన్నీ మాస్ ప్రేక్షకుల కు కిక్కివ్వడానికి మాత్రమేనని.. అంతకు మించి మరేమీ లేదని కొట్టిపారేస్తున్నారు. ఏదేమైనా దర్శకుడు అనిల్ రావిపూడి తన డైలాగ్స్ తో కాక రేపాడు అనేది వాస్తవం.