Begin typing your search above and press return to search.
ఐఎంఎస్ మాస్టర్ క్లాస్ లో మిల్కీ.. మలైకా
By: Tupaki Desk | 5 April 2019 12:18 PM GMTఇంటర్నేషనల్ గా ఫేమస్ అయిన అమెరికన్ మేకప్ ఆర్టిస్ట్ బాబీ బ్రౌన్ ఈ నెలలో ఇండియాకు వస్తున్నారు. బాబీ బ్రౌన్ బ్రాండ్ తో పలురకాల కాస్మెటిక్స్ ను ప్రాచుర్యంలోకి తీసుకురావడమే కాకుండా ఆవిడ మేకప్ & బ్యూటీపై 8 పుస్తకాలు రాశారు. మేకప్ ఔత్సాహికులకు ఆ పుస్తకాలు రూల్ బుక్స్ లాంటివి అని అంటూ ఉంటారు. 61 ఏళ్ళ వయసున్న బాబీ బ్రౌన్ 'ఇండియా మేకప్ షో' మొదటి ఎడిషన్ లో పాల్గొనేందుకు భారతదేశం వస్తున్నారు.
రాహుల్ తుల్జాపుర్కర్.. నినద్ షా లు నెలకొల్పిన బ్రదర్స్ ఇన్ కార్పోరేటెడ్ వారు ఈ షో ను ప్రారంభిస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి షో ఏప్రిల్ 13 న ముంబై లోనూ.. ఏప్రిల్ 20 న దిల్లీలోనూ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఆమె మాస్టర్ క్లాస్ కు మూడు రకాల మేకప్ లు ఎంచుకున్నారట. బ్రైడల్.. ఈవెనింగ్.. ఎడిటోరియల్. ఈ లుక్స్ లో కనిపించేందుకు ఆవిడ ఇద్దరు ప్రముఖ సెలబ్రిటీలను ఎంచుకున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు తమన్నా కాగా మరొకరు మలైకా అరోరా. ముంబై షో లో తమన్నా.. దిల్లీ షో లో మలైకా పాల్గొంటుందని సమాచారం.
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తమన్నా ఫుల్ గా ఎగ్జైట్ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తనలాంటి ఎంతోమంది యువతులకు బాబీ బ్రౌన్ ఒక రోల్ మోడల్ అని.. ఈ కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఒక గౌరవంగా భావిస్తున్నానని తెలిపింది. ఈ ఈవెంట్ కోసం తన షెడ్యూల్ ను అటూ ఇటూ మార్చాల్సి వచ్చిందని కూడా తెలిపింది. మరోవైపు మలైకా కూడా అలాంటి అభిప్రాయమే వ్యక్తం చేసింది. ఇప్పటివరకూ చాలామంది మేకప్ ఆర్టిస్టులతో పని చేశానని.. కానీ బాబీ బ్రౌన్ లాంటి ఐకాన్ తో పని చేయడం తనకు ఎంతో గౌరవం అని చెప్పింది. బాబీ బ్రౌన్ ఈ కార్యక్రమం గురించి మాట్లాడుతూ "భారతీయులు సహజ సౌందర్యంతో ఉంటారని నేనెప్పుడూ భావిస్తాను. ఇండియాలో జరగనున్న నా మొదటి మాస్టర్ క్లాస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అని తెలిపింది.