Begin typing your search above and press return to search.

రాజమౌళి పట్ల అంకితభావం చూపకుండా ఎలా ఉండగలం?!

By:  Tupaki Desk   |   11 Aug 2022 9:17 AM GMT
రాజమౌళి పట్ల అంకితభావం చూపకుండా ఎలా ఉండగలం?!
X
సాధారణంగా ఒక సినిమా చూసిన తరువాత ఆ సినిమాల్లోని మాటలు .. పాటలు మాత్రమే ఎక్కువకాలం గుర్తుంటాయి. కానీ 'బాహుబలి' అందుకు భిన్నంగా కనిపిస్తుంది. ఎందుకంటే 'బాహుబలి' పేరు వినగానే మాటలు .. పాటల కంటే ముందుగా రెండు స్టిల్స్ ప్రేక్షకుల కళ్లముందు కదలాడతాయి.

ఒకటి 'మహేంద్ర బాహుబలి' పసికందుగా ఉన్నప్పుడు రమ్యకృష్ణ ఆ బిడ్డను చేతిలో పెట్టుకుని నదీ ప్రవాహాన్ని దాటడం .. రెండవది 'కట్టప్ప' మోకాళ్లపై కూర్చుని బాహుబలి పాదాన్ని తీసుకుని తన శిరస్సు పైన పెట్టుకోవడం.

'బాహుబలి'పై కట్టప్పకిగల ప్రేమాభిమానాలకు ఆ సన్నివేశం నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తుంది. ఆ సినిమాలో గూస్ బంప్స్ తెప్పించే సన్నివేశాల్లో అది ఒకటి. అలాంటి సన్నివేశాన్ని తనదైన స్టైల్లో అనుకరిస్తూ కాజల్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాజల్ తన కొడుకు 'నీల్' పసి పాదాన్ని తలపై పెట్టుకుని తరించిపోతున్న ఈ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. బిడ్డ పాద స్పర్శ తల్లికి ఎంతటి అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుందనడానికి ఈ పోస్టర్ అద్దం పడుతోంది.

కాజల్ తన కొడుకు నీల్ పాదాన్ని తలపై పెట్టుకుని, తనకీ .. నీల్ కీ రాజమౌళి పట్ల అంకితభావం లేకుండా ఎలా ఉంటుంది? అంటూ కామెంట్ ను కూడా పోస్ట్ చేసింది. ఒక పాలకుడికి .. విశ్వాసపాత్రుడికి మధ్య గల సన్నివేశాన్ని తెరపై రాజమోళి అద్భుతంగా ఆవిష్కరిస్తే, తల్లీబిడ్డల అనుబంధానికి అద్దం పడుతూ అదే దృశ్యాన్ని కాజల్ ఆవిష్కరించిన తీరు ప్రతి మనసుకు కనెక్ట్ అవుతోంది.

కాజల్ ఈ క్యాప్షన్ ను రాజమౌళికి ట్యాగ్ చేసింది. కాజల్ తల్లిప్రేమను అంతా కూడా అభినందిస్తున్నారు. కొంతకాలంగా ఆమె సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.