Begin typing your search above and press return to search.
సైరా అతను ఎందుకు వద్దనుకున్నాడు ?
By: Tupaki Desk | 29 May 2019 7:34 AM GMTమెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సైరా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇంకా ఎంత బాలన్స్ ఉందనే ఖచ్చితమైన సమాచారం లేదు కాని జూన్ నెలాఖరుకు గుమ్మడికాయ కొట్టేలా ప్లానింగ్ జరుగుతున్నట్టు తెలిసింది. ఇటీవలే హింది వెర్షన్ తాలుకు హక్కులు ఫర్హాన్ అక్తర్ కు చెందిన ఎక్సెల్ సంస్థ పొందిన సంగతి తెలిసిందే. ఎంత మొత్తం అనేది బయటికి రాలేదు కాని క్రేజీ ఆఫర్ తోనే క్లోజ్ చేశారట.
కేజిఎఫ్ మార్కెట్ చేసిన అనుభవం ఉంది కాబట్టి సైరాను దాన్ని కన్నా మెరుగ్గా నార్త్ ప్రేక్షకులకు చేరువ చేయమని చరణ్ ప్రత్యేకంగా కోరాడట. అయితే దీని కన్నా ముందు సైరాను కరణ్ జోహార్ ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ ద్వారా రిలీజ్ చేయించాలని చరణ్ చాలా ట్రై చేశాడట. బాహుబలిని కరణ్ మార్కెట్ చేసిన విధానం రాష్ట్రాలతో సంబంధం లేకుండా దాన్ని నలుమూలలకు తీసుకెళ్ళిన వైనం ఎన్నో రికార్డులు తెచ్చి పెట్టింది. ఆ బ్యానర్ వేల్యూ సైరాకు హెల్ప్ అవుతుందని చెర్రి ఆలోచన.
అయితే మల్టీ స్టారర్స్ ఎందరు ఉన్నా సైరా ఒక ప్రాంతీయ సమరయోధుడి కథ కావడం దర్శకుడు సురేందర్ రెడ్డికి నేషనల్ లెవెల్ లో బ్రాండింగ్ లేకపోవడం లాంటి కారణాల వల్ల అంత పాజిటివ్ గా రెస్పాండ్ కాలేదని బాలీవుడ్ టాక్. ఆఖరికి కరణ్ బెస్ట్ ఫ్రెండ్ రాజమౌళితో రాయబారం చేసినా వర్క్ అవుట్ కాలేదని వినికిడి. నిజానికి ఆర్ ఆర్ ఆర్ కూడా కరణ్ జోహార్ ఇంకా అడగలేదు. కొంచెం టైం తీసుకుని తర్వాత అలోచిద్దామనే ప్లాన్ లో ఉన్నాడు. మెగా ఫాన్స్ మాత్రం కేజిఎఫ్ తో హిట్టు కొట్టిన లక్కీ బ్యానర్ కాబట్టి ఎక్సెల్ ద్వారా సైరాకు మంచి రిలీజ్ దక్కుతుందని ఆశిస్తున్నారు. ఇప్పటికి ఉన్న సమాచారం మేరకు సైరా అక్టోబర్ 2 విడుదల కానుంది