Begin typing your search above and press return to search.
వదిలేది లేదు.. తవ్వుతూనే ఉంటుందట!
By: Tupaki Desk | 24 Nov 2018 5:00 PM GMTతమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుపై సింగర్ అండ్ డబ్బింగ్ ఆర్టిస్టు అయిన చిన్మయి మీటూ అంటూ లైంగిక వేదింపు ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. తమిళ సినీ పరిశ్రమలో లెజెండ్ గా గుర్తింపు ఉన్న రచయితపై చిన్మయి ఆరోపణలు చేయడంతో కొందరు ఆమెను టార్గెట్ చేశారనిపిస్తోంది. తనను మెల్లగా ఇండస్ట్రీ నుండి తరిమేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని చిన్మయి పేర్కొంది. తనపై జరిగిన లైంగిక వేదింపులనే కాకుండా ఇతరుల విషయాలను కూడా బయటకు తీసుకు వచ్చిన చిన్మయి ఆమద్య డబ్బింగ్ ఆర్టిస్టు అసోషియేషన్ అధ్యక్షుడు రాధ రవిపై ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. తాజాగా ఆయన చిన్మయి డబ్బింగ్ ఆర్టిస్టు అసోషియేషన్ నుండి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం కూడా తెలిసిందే. తనను బహిష్కరించడంపై చిన్మయి పెద్ద ఉద్యమానికే సిద్దం అయ్యింది.
తనను బహిష్కరించిన వారిపై తిరుగుబాటు చేస్తోంది. ఇప్పటికే డబ్బింగ్ ఆర్టిస్టు అసోషియేషన్ పై న్యాయ పోరాటం చేస్తున్న కొందరితో కలిసి ముందుకు వెళ్లేందుకు సిద్దం అవుతుంది. తాను డబ్బింగ్ ఆర్టిస్టు అసోషియేషన్ లో జీవిత కాల సభ్యురాలినని, అందుకోసం 2016 - ఫిబ్రవరి 11న రుసుము కూడా చెల్లించినట్లుగా పేర్కొంది. ఇక తన ప్రతి సినిమా పారితోషికం నుండి 10 శాతం వసూళ్లు చేస్తున్నారని కూడా చెప్పుకొచ్చింది. తాను ఫీజు చెల్లించడం లేదనే విషయంలో నిజం లేదనే, తనపై కక్ష కట్టి మరీ బహిష్కరించారని ఆవేదన వ్యక్తం చేసింది.
తాజాగా సోషల్ మీడియాలో ఒక సుదీర్ఘమైన వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోలో మరోసారి రాధారవి మరియు కొందరిపై ఆమె ఆరోపణలు చేసింది. చిన్మయి మళ్లీ తనను డబ్బింగ్ ఆర్టిస్టు అసోషియేషన్ లో తీసుకునే వరకు వదిలేది లేదని చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలోని ఇంకా పెద్దలకు సంబంధించిన విషయాలను తవ్వుతూనే ఉంటానని, అందరి బండారాలు బయటకు తీసుకు వస్తానని హెచ్చరించింది. తన బహిష్కారంపై తమిళ సినీ వర్గాల పెద్దలు స్పందించక పోవడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.