Begin typing your search above and press return to search.

సంపత్ కుమార్ కాస్తా సంపత్ రాజ్ ఎలా అయ్యాడు?

By:  Tupaki Desk   |   14 Feb 2022 4:29 AM GMT
సంపత్ కుమార్ కాస్తా సంపత్ రాజ్ ఎలా అయ్యాడు?
X
తెలుగు తెర మీద స్టైలిష్ విలన్ గా సుపరిచితుడు సంపత్ రాజ్ అలియాస్ సంపత్ కుమార్. అచ్చ తెలుగోడైన ఆయన్ను చాలామంది వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా చెబుతారు.

ఆయన నెల్లూరు జిల్లాకు చెందిన వాడన్న విషయం చాలామందికి తెలీదు. గడిచిన రెండు దశాబ్దాలుగా తెలుగు తెర మీద విలనిజాన్ని పండిస్తూనే.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన సత్తా చాటుతుంటారు. ఇంతకీ సంపత్ కుమార్ కాస్తా సంపత్ రాజ్ గా మారటమే కాదు.. అసలు పేరు పక్కకు వెళ్లిపోయి.. కొసరు పేరే అసలు పేరుగా ఎలా మారింది? అన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానాన్ని చెప్పుకొచ్చారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పలు విషయాల్ని షేర్ చేసుకున్న సంపత్.. తన పేరు ఎలా మారిందన్న విషయాన్ని చెబుతూ.. తన అసలు పేరు సంపత్ కుమార్ అని వెల్లడించారు.

తన స్నేహితుడు ఒకరు తన ఈమొయిల్ క్రియేట్ చేసే వేళలో సంపత్ కుమార్ పేరు మీద ఐడీ దొరక్కపోవటం.. సంపత్ రాజ్ అని వెతికితే.. ఐడీ అందుబాటులో ఉండటం.. దాన్ని ఓకే చేయటంతో తన పేరు కాస్తా సంపత్ రాజ్ గా మారిందన్నారు. తన తండ్రిది నెల్లూరు అని.. ఆర్మీలో ముప్ఫై ఏళ్లు పని చేశారని.. తల్లిది తమిళనాడులోని తిరుచనాపల్లి అని చెప్పారు.

తమ కుటుంబం బెంగళూరులో స్థిరపడినట్లు చెప్పిన ఆయన.. తాము మొత్తం ఏడుగురు సంతానమని చెప్పారు. చాలా మంది ఇళ్లకు భిన్నంగా తమ ఇంట్లో తన తండ్రి చాలా సరదాగా ఉంటే.. అమ్మ మాత్రం ఆర్మీలా పరమ స్ట్రిక్ట్ అని చెప్పారు. తమ ఇంట్లో మతం అంటే రెండే రెండు అని.. అది ఒకటి మగ.. రెండోది ఆడ మాత్రమేనని చెప్పి.. తన ఇంట్లోని వారి పెళ్లిళ్ల గురించి ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు.

‘మా పెద్దన్న ముస్లింని పెళ్లాడి, ఇస్లాంలోకి కన్వర్ట్‌ అయ్యారు. లండన్‌లో ఉన్న ఇంకో బ్రదర్‌ క్రిస్టియన్‌ అమ్మాయిని చేసుకున్నారు. ముంబయిలోని ఓ సిస్టర్‌ మరాఠీ అతన్ని పెళ్లి చేసుకుంది. మా అమ్మా నాన్న ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు’ అంటూ ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు.