Begin typing your search above and press return to search.

ఘట్టమనేని శివరామకృష్ణ మూర్తి.. సూపర్ స్టార్ కృష్ణ ఎలా అయ్యారు..?

By:  Tupaki Desk   |   15 Nov 2022 4:08 AM GMT
ఘట్టమనేని శివరామకృష్ణ మూర్తి.. సూపర్ స్టార్ కృష్ణ ఎలా అయ్యారు..?
X
గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో జన్మించిన ఘట్టమనేని శివరామకృష్ణ సూపర్ స్టార్ కృష్ణగా ఎలా అయ్యారు అంటే.. బి.ఎస్.సి పట్టా పొందిన వెంటనే కాలేజిలో చదువుకునే రోజుల్లోనే నటన మీద ఆసక్తి చూపించారు. ఆ ఇంట్రెస్ట్ వల్లే సినీ రంగ ప్రవేశం చేశారు.

లీడ్ రోల్ కన్నా ముందు పందండి ముందుకు, కులగోత్రాలు, పరువు ప్రతిష్ట్ర సినిమాల్లో నటించారు కృష్ణ. ఆ సినిమాలతో పెద్దగా గుర్తింపు రాలేదు. ఆదుర్తి సుబ్బారావు కొత్త వాళ్లతో చేస్తున్న తేనెమనసులు సినిమాల్లో లీడ్ రోల్ కి సెలెక్ట్ అయ్యారు కృష్ణ,.ఆ సినిమానే ఆయన లైఫ్ టర్న్ చేసింది.

తేనెమనసులు హిట్ అవడంతో ఆదుర్తి సుబ్బారావుతో వరుస సినిమాలు చేశారు. తేనే మనసులు సినిమాకు కృష్ణ తీసుకున్న రెమ్యునరేషన్ రెండు వేలు. అదే కాదు నిర్మాతల హీరో అనిపించుకున్న కృష్ణ దాదాపు 40 సినిమాల దాకా ఐదు వేల రెమ్యునరేషన్ కే సినిమాలు చేశారు.

గూఢచారి 116 సినిమాతో యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు కృష్ణ. తెలుగు తెర మీద తొలి కౌ బోయ్ హీరోగా కనిపించింది సూపర్ స్టార్ కృష్ణనే. సినిమాల్లో తన మార్క్ స్పష్టంగా కనిపించి బాక్సాఫీస్ కి కాసుల వర్షం కురిపించిన కృష్ణ ని అంతకుముందు అభిమానులంతా నట శేఖర, డేరింగ్ అండ్ డ్యాషింగ్ హీరో అని పిలుచుకునే వారు. ఆ టైం లో సినీ వార పత్రిక శివరంజని ఓటింగ్ వల్ల కృష్ణ గారికి సూపర్ స్టార్ అనే బిరుదు వచ్చింది. సూపర్ స్టార్ అనే బిరుదు ఎవరికి ఇస్తారని ఓటింగ్ నిర్వహించింది శివరంజని. అప్పుడు తిరుగులేని మెజార్టీ రావడంతో కృష్ణ ఆ స్క్రీన్ నేమ్ ఫిక్స్ చేశారు.

అప్పటినుంచి ఆయన సూపర్ స్టార్ గా మారారు. సాహసం తన ఇంటి పేరుగా మార్చుకున్న కృష్ణ ఎన్నో ప్రయోగాత్మక సినిమాలు చేశారు. తెలుగు సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలు ఎన్నో. ఎప్పుడూ కొత్తదనం కోసం చూసే కృష్ణ సినిమా టెక్నాలజీని కూడా అడ్వాన్స్ గా ఉండాలని చెప్పేవారు. కేవలం హీరోగానే కాదు దర్శక నిర్మాతగా.. స్టూడియో అధినేతగా.. సూపర్ స్టార్ కృష్ణ తెలుగు పరిశ్రమ అభివృద్ధికి సపోర్ట్ గా నిలిచారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.