Begin typing your search above and press return to search.

తెలుగు హీరోలు ఈ సినిమాను ఎలా వదిలేశారు

By:  Tupaki Desk   |   17 Aug 2022 10:30 AM GMT
తెలుగు హీరోలు ఈ సినిమాను ఎలా వదిలేశారు
X
తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సీతారామం సినిమా దుల్కర్ సల్మాన్‌ మరియు మృనాల్‌ ఠాకూర్ లకు మంచి పేరును తెచ్చి పెట్టింది. హీరోగా దుల్కర్‌ సల్మాన్ కి ఇది కెరీర్‌ బెస్ట్‌ మూవీ అనడంలో సందేహం లేదు. ఒక తెలుగు సినిమా కు మలయాళ హీరో ను తీసుకోవడం వెనుక ఉద్దేశ్యం ఏంటి అనేది దర్శకుడు హను రాఘవపూడి పలు సందర్బాల్లో చెప్పుకొచ్చాడు.

కానీ అసలు విషయం ఏంటంటే సీతారామం సినిమా కథను తెలుగు హీరోలకే వినిపించాడట. ముగ్గురు నలుగురు హీరోలకు సీతారామం లైన్ వినిపించారు. కొందరికి పూర్తి కథను కూడా వినిపించారు.

కాని వారు ఎవ్వరు కూడా హను రాఘవపూడి గత చిత్రాల అనుభవం నేపథ్యంలో... ఆయన సినిమాల ప్లాప్‌ నేపథ్యంలో ఓకే చెప్పలేదట.

సీతారామం ను కాదన్న హీరోల్లో నాని మరియు రామ్‌ లు ఉన్నారట. వీరిద్దరిలో నాని కనుక సీతారామం సినిమాను చేసి ఉంటే ప్రాణం పోసినట్లుగా ఉండేది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నాని సహజ నటన సినిమాకు మరింత హైలైట్ అవ్వడంతో పాటు ఆయన కెరీర్‌ లో నిలిచి పోయే సినిమా అయ్యేది.

టాలీవుడ్‌ లో పెద్దగా క్రేజ్‌ లేని దుల్కర్‌ సల్మాన్ తో సినిమా ను చేయడం వల్ల చాలా మంది డబ్బింగ్‌ సినిమా అనే అభిప్రాయం తో ఉండేవారు. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిన తర్వాత అవన్నీ కూడా గాలికి కొట్టుకు పోయాయి.

హీరోయిన్ గా నటించిన మృనాల్ ఠాకూర్ కి మంచి స్పందన వచ్చింది. హీరో మరియు హీరోయిన్‌ టాలీవుడ్‌ లో ఒకే చెప్పాలే కాని వరుసగా సినిమాల్లో ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది.