Begin typing your search above and press return to search.
ఇండస్ట్రీ గందరగోళం నుంచి బయటపడేదెలా?
By: Tupaki Desk | 28 Aug 2021 9:48 AM GMTకరోనా మహమ్మారీ రెండేళ్లుగా సినీపరిశ్రమను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సంగతి తెలిసిందే. థియేట్రికలర్ రంగంపై బిగ్ పంచ్ వేసింది కరోనా. ఇటీవల సెకెండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చడంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. అప్పటివరకూ కరోనాని లైట్ తీసుకున్న ప్రజలంతా ఒక్కసారిగా అలెర్ట్ అయ్యారు. సెకెండ్ వేవ్ మరణ భయాన్ని జనాల గుండెల్లో బలంగా నాటేసింది. దీంతో ప్రేక్షకులు థియేటర్ల కు రావాలంటే ఒణికిపోయే సన్నివేశం ఏర్పడింది. ప్రస్తుతానికి థర్డ్ వేవ్ ప్రభావం అంతగా లేకున్నా..అక్కడక్కడా కొన్ని కేసులు కొనసాగినా.. పాజిటివ్ వస్తే పరిస్థితి ఏంటి? అన్న భయం జనాల్ని ఇంకా వెంటాడుతోంది. ఆ కారణంగా థియేటర్ వైపు జనాలు చూడలేదు. ఇదే భయం ఇంకా ఎన్నాళ్లు కొనసాగుతుందో తెలియదు.
స్కూళ్లు.. కాలేజీలకు తప్పదు కాబట్టి వెళ్లాలి. కానీ థియేటర్ కి ఎంటర్ టైన్ అవ్వడానికి వెళదామంటే వెనకాడే వారే తప్ప ఎంకరేజ్ చేసే వారుండరు. ఆ కారణంగాను యువత థియేటర్ వైపు చూడలేదు. ఏపీ సహా తెలంగాణ లో థియేటర్లు రన్నింగ్ లో ఉన్న పెద్ద సినిమాలేవి ఇప్పటివరకూ రిలీజ్ కాలేదు. సెప్టెంబర్.. అక్టోబర్ లో రిలీజ్ ప్లాన్ చేసుకున్నప్పటికీ కరోనా సహా ఏపీలో థియేటర్ సిస్టమ్ లో ఉన్న కొన్ని కారణాలు సినిమాలు రిలీజ్ కావడం లేదు. వచ్చే వారంలో రిలీజ్ కావాల్సిన లవ్ స్టోరీ..సిటీ మార్ చిత్రాలు ఇప్పటికే వాయిదా పడినట్లు వార్తలొస్తున్నాయి.
గీతా ఆర్స్ట్ లో మూడు సినిమాలు.. సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో నాలుగు సినిమాలు..యూవీ క్రియేషన్స్ లో రెండు చిత్రాలు థియేటర్ రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. కానీ రిలీజ్ చేస్తే ప్రమాదమేనేమో అన్న భయం వెంటాడుతోంది. అలాగని ఓటీటీ రిలీజులపైనా వీళ్లు అంతా ఆసక్తి చూపించడం లేదు. ఓటీటీ సేఫ్ జోన్ తప్ప...పెద్దగా లాభాలు ఉండటం లేదు. థియేటర్ రిలీజ్ చూస్తే మరో రకంగా ఉంది. హిట్ అయితే థియేటర్ రిలీజ్ భారీ వసూళ్లే సాధిస్తాయి. కానీ అంతకు ముందుగా ప్రిపేర్ అయ్యి పెద్ద సాహసం చేయాలి. మరి ఇదే పరిస్థితి మరో రెండు నెలలు కొనసాగితే సినిమాలు నిర్మాణం కూడా ఆపేసే పరిస్థితి ఉంటుంది. కంటెంట్ ఎక్కువ కాలం నిల్వ ఉన్నా క్వాలిటీలో లోపం వస్తుంది. ఈ లెక్కలన్నింటినీ బేరీజు వేసుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుందని విశ్లేషిస్తున్నారు.
రకరకాల పర్యవసానాలు సందిగ్ధతల నడుమ పరిశ్రమ కొట్టుమిట్టాడుతోంది. అయితే దీనినుంచి బయటపడేసేందుకు ఏదైనా సరికొత్త మాస్టర్ ప్లాన్ ని సినీపెద్దలు ఆలోచిస్తే బావుంటుందేమో! సినిమాల నిర్మాణంలో ఒరవడిని ప్రణాళికను ప్రస్తుత కాలానికి తగ్గట్టు మార్చుకుంటనే బెటర్ గా ఉంటుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మునుముందు ఏం జరగనుందో వేచి చూడాలి.
డైలమా నుంచి బయటపడలేక..!
సెకండ్ వేవ్ అనంతరం థియేటర్లు తెరిచినా నిర్మాతలలో గందరగోళం తొలగిపోవడం లేదు. తమ సినిమాల్ని ఒకటొకటిగా రిలీజ్ చేసేందుకు తేదీల్ని లాక్ చేస్తున్నా డౌట్లు చాలా ఉన్నాయి. కొందరు ఓటీటీలకు వెళుతుంటే మరికొందరు థియేట్రికల్ రిలీజ్ లనే సేఫ్ గా భావిస్తున్నారు. ఇటీవల పలు సినిమాల రిలీజ్ తేదీల విషయంలో గందరగోళం నెలకొంది. ఒకే రిలీజ్ తేదీని ప్రతి ఒక్కరూ లాక్ చేసేందుకు ప్రయత్నిస్తుండడంతో ఈ గందరగోళం మరింతగా కనిపించింది. సెప్టెంబర్ 10న వినాయక చవితిని పురస్కరించుకుని వరుసగా మూడు సినిమాల్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేయడం చర్చకు వచ్చింది.
వీటిలో నాగచైతన్య - నితిన్ - నాని- రానా లాంటి స్టార్లు నటించిన సినిమాలు డైలమాలో రిలీజ్ లకు రాకుండా ఉన్నాయి ఇంతకాలం. కొద్దిరోజులుగా రిలీజ్ తేదీని ప్రకటించడం తిరిగి రావడం లేదంటూ వెల్లడించడం రొటీన్ అయిపోయింది. ఈ కన్ఫ్యూజన్ చూస్తుంటే అసలేం జరుగుతోంది? అంటూ ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి గందరగోళం వద్దనుకునేవాళ్లంతా లాభాల్లేకపోయినా ఓటీటీలను ఆశ్రయిస్తున్నారు.