Begin typing your search above and press return to search.
సోనూసూద్ కి అంత డబ్బు ఎలా వస్తుందంటే ..?
By: Tupaki Desk | 26 May 2021 4:30 AM GMTసోనూ సూద్ .. సినిమాలకి మాత్రమే పరిమితం అయ్యే అనితర సాధ్యమైన ఎన్నో మంచి పనులని , చేసి చూపిస్తన్నారు. సినిమాల్లో విలన్ గా అభిమానులని మెప్పించినా నిజ జీవితం లో రియల్ హీరోగా మారాడు సోనూసూద్. ప్రస్తుతం దేశం లో ఏ ఒక్కరికి ఏ ఆపద వచ్చినా కూడా మొదటగా అందరికి గుర్తుకు వచ్చే పేరు సోనూసూద్. చాలామంది ఇప్పటికే ప్రభుత్వాన్ని సహాయం అడగడం మానేసి సోనూసూద్ ను అడుగుతున్నారు. ఆక్సిజన్ కావాలని అడిగిన ప్రతీ ఒక్కరికీ క్షణాల్లో డెలివరీ చేస్తున్నారు. చివరకు జిల్లా కలెక్టర్లు, ప్రభుత్వాలు కూడా సోనూ సూద్ సాయాన్ని తీసుకుంటున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సోనూ సూద్ గత ఏడాది నుంచి నిర్విరామంగా దేశ ప్రజలకు సాయం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ క్షణం తీరిక లేకుండా ప్రజాసేవలోనే ఉంటున్నారు. తన ఇంటికి వచ్చి గోడును వెల్లగక్కుంటున్నవారి బాధలను సోనూ సూద్ వింటున్నారు.
ఫస్ట్ వేవ్ సమయంలో లాక్ డౌన్ ను అప్పటికప్పుడు ప్రకటించడం తో దిక్కుతోచని స్థితి లో సొంతూర్లకి కూడా పోలేని వారిని తన డబ్బుతో వారి గమ్యస్థానాలకు చేర్చడం తో మొదలు పెట్టి ఎన్నో విధాలుగా చేస్తూనే ఉన్నారు. ఏకంగా ఆక్సిజన్ ప్లాంటులే ఏర్పాటు చేస్తున్నాడు. అన్నీ కూడా ఉచితమే. దేశంలో ప్రస్తుతం ప్రభుత్వం కంటే సోనూసూద్ ను నమ్మేవారే ఎక్కువగా ఉన్నారు. అయితే , ఒక్క సోనూ ఇంతమందిని ఎలా ఆదుకోగలుగుతున్నాడు, అయన దగ్గర అన్ని డబ్బులెక్కడివి అనే సందేహాలు చాలామందిని వేధిస్తున్నాయి. ఓ ఇంటర్నేషనల్ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాడు సోనూసూద్. తాను గత ఏడాది చేసిన సేవా కార్యక్రమాలు చూసి ఎంతోమంది స్ఫూర్తి పొందారని, వారిలో చాలామంది తనను సంప్రదించారని, తాము ఇందులో భాగస్వాములం అవుతామని చెప్పారని చెప్పారు. తన మీద నమ్మకంతో వాళ్లు విరాళాలు ఇవ్వడంతో పాటు అనేక రకాలుగా సేవలో భాగస్వాములు అవుతున్నారని సోనూ చెప్పాడు. తన దగ్గరున్న డబ్బుకు ఈ విరాళాలు కూడా చేర్చి సోనూ సూద్ ఫౌండేషన్ ద్వారా ఈ మంచి పనులన్నీ చేయగలుగుతున్నానని వివరించాడు. మేము చేసిన సాయం పొందిన వాళ్ల స్పందన చూశాక, ఎన్నో ప్రాణాలు నిలబడ్డాక కలుగుతున్న సంతృప్తి మాటల్లో చెప్పలేనిదని, మరింతగా సేవా కార్యక్రమాలు చేపట్టడానికి అదే స్ఫూర్తిగా నిలుస్తోందని తెలిపాడు. కేవలం కరోనా బాధితుల్ని ఆదుకోవడంతో తాను ఆగిపోవట్లేదని, లాక్ డౌన్ కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వాళ్లను ఆదుకునేందుకు భారీ ప్రణాళికలే రచించామని, కంపెనీల భాగస్వామ్యంతో ఇప్పటికే 2 లక్షల మందికి ఉపాధి కల్పించామని సోనూసూద్ తెలిపారు.