Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ ని కొరటాల ఎలా చూపించబోతున్నాడు?
By: Tupaki Desk | 9 Sep 2022 12:30 AM GMTజక్కన్న తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా మూవీ 'RRR'తో వరల్డ్ వైడ్ గా భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ మూవీ అందించిన క్రేజ్ తో తన తదుపరి ప్రాజెక్ట్ ని భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా పట్టాలెక్కించాలని ప్లాన్ చేసుకున్నాడు. ఎన్టీఆర్ తన 30వ ప్రాజెక్ట్ ని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. గతంలో వీరిద్దరి కలయికలో 'జనతా గ్యారేజ్' అనే బ్లాక్ బస్టర్ మూవీ రూపొందిన విషయం తెలిసిందే.
దీంతో హిట్ కాంబినేషన్ మరో మెస్మరైజింగ్ బ్లాక్ బస్టర్ ని అందింస్తుందని ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీలయ్యారు. కానీ ప్రాజెక్ట్ ప్రకటించిన నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఈ సినిమా ముందుకు కదలడం లేదు. కొరటాల శివ 'ఆచార్య' ప్రాజెక్ట్ పనుల్లో వుండటం.. ఆ తరువాత ఆ మూవీ డిజాస్టర్ కావడంతో డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు సెటిల్ చేసే పనుల్లో బిజీగా గడుపడం వంటి రక రకాల కారణాలతో ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతూ వస్తోంది.
#NTR30 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందనున్న ఈ భారీ ప్రాజెక్ట్ ని యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ పై ఎన్టీఆర్ ఆర్ట్స్ నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో నిర్మించబోతున్నారు. గత కొన్ని నెలలుగా స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నఈ మూవీని ఎట్టకేలకు అక్టోబర్ థర్డ్ వీక్ లో కానీ నవంబర్ ఫస్ట్ వీక్ లో కానీ సెట్స్ పైకి తీసుకెళ్లాలని దర్శకుడు కొరటాల శివ ప్లాన్ చేస్తున్నారట. ఇందులో భాగంగా ఈ మూవీలో ఎన్టీఆర్ ని కొరటాల ఎలా చూపించబోతున్నారన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారింది.
ఎన్టీఆర్ పుట్టిన రోజున విడుదల చేసిన డైలాగ్ మోషన్ పోస్టర్ తో ఇందులో ఎన్టీఆర్ పాత్ర పవర్ ఫుల్ గా వుంటుందని స్ఫష్టమైంది. అయితే మేకోవర్ ఎలా వుండనుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ పాత్ర కోసం ఎన్టీఆర్ గత కొన్ని రోజులుగా బరువు తగ్గుతూ వర్కవుట్ లు చేస్తున్నారు. తాజా సమచారం ప్రకారం బరో 5 కేజీల బరువు తగ్గనున్నాడట. ఇందు కోసం ప్రస్తుతం ఎన్టీఆర్ కసరత్తులు చేస్తున్నాడని తెలిసింది.
టాప్ హీరోయిన్ ఎన్టీఆర్ కు జోడీగా నటించనుందని, త్వరలోనే మేకర్స్ ఆ విషయాన్ని ప్రకటించనున్నారని చెబుతున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ,చ హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.