Begin typing your search above and press return to search.
మిషన్ మంగళ్ ఎలా ఉంది ?
By: Tupaki Desk | 16 Aug 2019 5:15 PM GMTకమర్షియల్ హీరోలకు దూరంగా విభిన్నమైన కథలతో ప్రయోగాలు చేసే అక్షయ్ కుమార్ తన ప్రతి సినిమాలో ఏదో ఒక మంచి మెసేజ్ లేదా స్ఫూర్తి ఉండేలా చూసుకుంటాడు. ఆ క్రమంలో చేసిందే మిషన్ మంగళ్. నిన్న దేశవ్యాప్తంగా విడుదలైన ఈ స్పేస్ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక కంటెంట్ విషయానికి వస్తే ఇస్రోలో పని చేసే సైంటిస్ట్ రాకేష్(అక్షయ్ కుమార్) కు పిఎస్ఎల్వి ప్రయోగం ఫెయిల్ అయిన కారణంగా మార్స్ డిపార్ట్మెంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. తక్కువ ఖర్చుతో మార్స్ కు ఉపగ్రహాన్ని పంపిస్తానని టాస్క్ తీసుకుంటాడు రాకేష్.
అందుకు ఐడియా ఇస్తుంది ప్రాజెక్ట్ డైరెక్టర్ విద్యా బాలన్. ఇది ఎలాగూ వర్క్ ఔట్ కాదని భావించిన ప్రాజెక్ట్ హెడ్ ఉద్దేశపూర్వకంగా అనుభవం లేని నలుగురు మహిళలను ఒక జూనియర్ ని ఒక రిటైర్డ్ శాస్త్రవేత్తని రాకేశ్ కు టీమ్ గా ఇస్తారు. ఇంత క్లిష్టమైన బాధ్యతను వాళ్ళ సహకారంతో విజయవంతంగా ఎలా నెరవేర్చాడు అనేదే ఈ మిషన్ మంగళ్
సినిమాలో మెయిన్ హై లైట్ గా చెప్పుకోవాల్సింది విద్యా బాలన్ గురించే. అక్షయ్ కుమార్ లాంటి స్టార్ ని సైతం డామినేట్ చేస్తూ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. సగటు మహిళగా ఇంట్లో బాధ్యతలు నిర్వర్తిస్తూనే తక్కువ నూనెతో పూరిలు చేసే హోమ్ సైన్స్ సూత్రాన్ని స్పేస్ శాటిలైట్ కి ముడిపెట్టే తీరులో సూపర్బ్ అనిపించింది.
తాప్సీ - నిత్య మీనన్ - సోనాక్షి సిన్హా ఎవరికి వారు డిఫరెంట్ రోల్స్ లో వాహ్ అనిపించారు. కమర్షియల్ అంశాలు తక్కువగా ఉన్న మిషన్ మంగళ్ అన్ని వర్గాలకు కనెక్ట్ అవ్వడం గురించి ఖచ్చితంగా చెప్పలేం కానీ ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అనే అభిప్రాయం కలిగించడంలో మాత్రం సక్సెస్ అయ్యింది. బాట్లా హౌస్ పోటీలో ఉన్నప్పటికీ మిషన్ మంగళ్ మంచి ఓపెనింగ్స్ తో పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది