Begin typing your search above and press return to search.
'సైనా' బయోపిక్ ఎలా ఉందంటే..!
By: Tupaki Desk | 26 March 2021 5:30 PM GMTభారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనానెహ్వాల్ జీవిత కథ ఆధారంగా ''సైనా'' అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఒలింపిక్స్ లో భారత్ కు కాంస్య పతకం తెచ్చిపెట్టి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సైనా జీవితం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. ఇప్పుడు ఆమె బయోపిక్ లో బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా టైటిల్ రోల్ పోషించింది. మానౌవ్ కౌల్ - ఇషాన్ నఖ్వీ - మేఘనా మాలిక్ - సుబ్రజ్యోతి బరాత్ - అంకుర్ విశాల్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. అమోల్ గుప్టే దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. టి-సిరీస్ ఫిల్మ్స్ - ఫ్రంట్ ఫుట్ పిక్చర్స్ బ్యానర్స్ పై భూషణ్ కుమార్ - కృష్ణన్ కుమార్ - సుజయ్ జైరాజ్ - రాశేష్ షా ఈ చిత్రాన్ని నిర్మించారు. టీజర్ ట్రైలర్లతో అంచనాలు పెంచేసిన 'సైనా' మూవీ ఈరోజు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన సైనా నెహ్వాల్ ప్రపంచస్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా ఎలా ఎదిగింది.. ఆమె జీవితంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఎలా ప్రభావితం చేశాయి.. ఒలింపిక్స్ లో పతకం సాధించే క్రమంలో ఆమెకు ఎలాంటి ప్రోత్సాహం లభించింది అనేది 'సైనా' సినిమాలో చూపించారు. క్రీడాకారుల జీవితాలను ఆధారంగా చేసుకుని అనేక బయోపిక్ వచ్చాయి. అయితే వాటిని డాక్యుమెంటరీ తరహాలో తీసినవి ఫెయిల్ కాగా.. కథలో భావోద్వేగాలు, కమర్షియల్ ఎలిమెంట్స్ కలబోసి మెప్పించినవి సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు 'సైనా' ద్వారా ప్రేక్షకులను అలరించడంలో దర్శకుడు అమోల్ గుప్త సక్సెస్ అయ్యారని అంటున్నారు.
సైనా నెహ్వాల్ పాత్రలో పరిణీతి చోప్రా మెప్పించారు. సాధారణంగా బయోపిక్ లలో నటించడం అంటే అంత ఆషామాషీ విషయం కాదు. అందులోనూ క్రీడాకారుల జీవితాలైతే మానసికంగా శారీరకంగా ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అయితే పరిణితి బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా కనిపించేందుకు కష్టపడిన తీరు వెండితెరపై కనిపించింది. సైనా హావభావాలతో గేమ్ ఆడుతూ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రానికి పీయూష్ షా కెమెరా పనితనం.. అమాల్ మాలిక్ సంగీతం మరో స్థాయికి తీసుకెళ్ళాయి. అయితే అందరికి తెలిసిన కథే కావడంతో సన్నివేశాలు రిపీటెడ్ గా వస్తున్నాయనే ఫీలింగ్ కలిగిస్తుంది. మొత్తం మీద 'సైనా' బయోపిక్ ప్రేక్షకులను మెప్పించిందని అర్థం అవుతోంది.