Begin typing your search above and press return to search.
బాలీవుడ్ ను 'కాశ్మీర్ ఫైల్స్' ఎలా చంపింది?.. ఆర్జీవీ విశ్లేషణ..!
By: Tupaki Desk | 23 March 2022 5:30 PM GMTనేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి తెరకెక్కించిన "ది కాశ్మీర్ ఫైల్స్" సినిమా దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపింది. చిన్న సినిమాగా 'రాధేశ్యామ్' వంటి పాన్ ఇండియా మూవీకి పోటీగా వచ్చి బాక్సాఫీస్ వద్ద పెను సంచనలం సృష్టిస్తోంది.
1990లలో కశ్మీర్ లో పండిట్లపై లోయలో జరిగిన దారుణలను అకృత్యాలను 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు. ఈ మూవీపై పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తుంటే.. మరికొంతమంది మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు.
సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ చరణ్ "కాశ్మీర్కాశ్మీర్ ఫైల్స్" విడుదలైన నాటి నుంచే ఈ సినిమాకు మద్దతు తెలుపుతూ వస్తున్నారు. ఇది బాలీవుడ్ గతిని స్థితిని మార్చిన సినిమా అని పేర్కొంటూ తన రివ్యూ ఇచ్చారు. ఈ క్రమంలో వరుస ట్వీట్స్ తో బాలీవుడ్ పై కౌంటర్లు వేస్తున్నారు.
రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా ఈ సినిమా పై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. దాదాసాహెబ్ ఫాల్కే యొక్క పాత బాలీవుడ్ ను 'కాశ్మీరీ ఫైల్స్' తో దారుణంగా చంపి.. 2022 మార్చి 11న వివేక్ అగ్నిహోత్రి కొత్త బాలీవుడ్ కు జన్మనిచ్చాడని పేర్కొన్నారు. ఈ సినిమా బాలీవుడ్ చరిత్రను మార్చేసిందని అభిప్రాయపడ్డారు.
రాబోయే రోజుల్లో సినీ జనాలందరూ వివేక్ అగ్నిహోత్రి అవార్డ్ కోసం ప్రయత్నిస్తారని ఆర్జీవీ ట్వీట్ చేశారు. 'బాలీవుడ్ నిర్మాణ సంస్థలు టాప్ లో ఉండటానికి పోటీపడుతూ ఉంటాయి. కానీ కాశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాలు ఎప్పుడు ఎలా వచ్చి టాప్ చైర్ లో కూర్చుంటాయో చెప్పలేం' అని వర్మ అన్నారు.
'ది కాశ్మీర్ ఫైల్స్ కిల్లర్ విజయం బాలీవుడ్ లో ఉన్న అపోహలను చేరిపేసిందని రాసుకొచ్చిన రామ్ గోపాల్ వర్మ.. ఆ అపోహలు ఇవేనంటూ ఓ డాక్యుమెంట్ లింక్ ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. కశ్మీర్ ఫైల్స్ చిత్రం బాలీవుడ్ ను ఎలా చంపిందనే దానిపై విశ్లేషించారు. అందులోని పాయింట్స్ క్రింది విధంగా ఉన్నాయి...
* హిట్ సాధించాలంటే పెద్ద స్టార్లు కావాలి (కాశ్మీర్ ఫైల్స్ లో స్టార్లు లేకపోవడమే కాకుండా..సినిమా డిజైన్ స్టార్ ను కలిగి ఉండకూడదు)
* హిట్ సాధించడానికి మీకు మెగా బడ్జెట్లు అవసరం (కాశ్మీర్ ఫైల్స్ చాలా తక్కువ బడ్జెట్)
* హిట్ కావాలంటే మీకు సూపర్ హిట్ పాటలు కావాలి (కాశ్మీర్ ఫైల్స్ లో ఒక్క థీమ్ తప్ప మరేమీ లేదు)
* హిట్ చేయడానికి మీకు మసాలా వినోదం అవసరం (కాశ్మీర్ ఫైల్స్ లో మీరు ఒక్కసారి కూడా నవ్వలేరు)
* హిట్ చేయడానికి మీకు పెద్ద ప్రొడక్షన్ హౌస్ కావాలి (కాశ్మీర్ ఫైల్స్ నిర్మాత గురించి ఎవరూ పెద్దగా వినలేదు)
* మీరు హిట్ చేయడానికి అనేక కోట్ల ప్రమోషన్స్ కావాలి (రాధే శ్యామ్ 25 కోట్లతో పోలిస్తే.. కాశ్మీర్ ఫైల్స్ నిర్మాతలు కేవలం 2.5 కోట్లు పబ్లిసిటీ కోసం ఖర్చు చేసారు)
* ప్రేక్షకులు లాజిక్స్ లేని సినిమాలే చూస్తారని అనుకోవద్దు (ప్రేక్షకులు తీవ్రమైన సమస్యల గురించి తెలుసుకోవాలని కోరుకుంటున్నారని కాశ్మీర్ ఫైల్స్ నిరూపించింది)
కాగా, 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రాన్ని ఆర్టికల్ 370 చుట్టూ జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. ఇందులో బాలీవుడ్ నటులు మిథున్ చక్రవర్తి - అనుపమ్ ఖేర్ మరియు పల్లవి జోషి ప్రధాన పాత్రలు పోషించారు. వారాంతంలో ఈ సినిమా 200 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.