Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌ 30 లో జాన్వీ కపూర్ ను కొరటాల అలా చూపించగలడా..?

By:  Tupaki Desk   |   2 Jan 2023 10:30 AM GMT
ఎన్టీఆర్‌ 30 లో జాన్వీ కపూర్ ను కొరటాల అలా చూపించగలడా..?
X
అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్‌ ఎట్టకేలకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతుంది. గత రెండు మూడు సంవత్సరాలుగా ఆమె టాలీవుడ్‌ ఎంట్రీ అదుగో ఇదుగో అంటూ వాయిదాలు పడుతూ వచ్చింది. ఎట్టకేలకు వరుసగా జాన్వీ కపూర్‌ తెలుగు సినిమాల్లో నటించేందుకు ఓకే చెప్పిందనే వార్తలు వస్తున్నాయి.

గత కొన్ని రోజులుగా కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా నటించబోతున్న సినిమాలో జాన్వీ కపూర్‌ ను హీరోయిన్‌ గా ఎంపిక చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ 30 సినిమా యొక్క క్రేజ్ నేపథ్యంలో జాన్వీ కపూర్‌ ను కాస్త ఎక్కువ పారితోషికం అయినా కూడా ఎంపిక చేశారు అంటూ సమాచారం అందుతోంది.

ఇక కొరటాల శివ తన సినిమాల్లో ఎక్కువ శాతం హీరోయిన్స్ ను సింపుల్‌ అండ్‌ క్యూట్‌ గా చూపిస్తూ ఉంటాడు. ఈ సినిమాలో కూడా జాన్వీ కపూర్‌ ను అలాగే చూపిస్తాడా లేదంటే ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కు తగ్గట్లుగా జాన్వీకపూర్‌ ను కూడా మాస్ రోల్‌ లో చూపిస్తాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

జాన్వీ కపూర్‌ ను మాంచి మాస్ రోల్‌ లో చూడాలని అభిమానులు చాలా రోజులుగా కోరుకుంటున్నారు. హిందీలో ఇప్పటి వరకు ఆమె పోషించిన పాత్రలు కూడా చాలా రొటీన్‌ గా ఉన్నాయి. అందుకే అక్కడ సక్సెస్ దక్కించుకోలేదు. అందుకే తెలుగు లో ఈ అమ్మడు మాస్ రోల్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

కొరటాల శివ గత చిత్రం ఆచార్య నిరాశపరచడంతో తదుపరి సినిమా అయిన ఎన్టీఆర్‌ 30 పట్టాలెక్కే విషయంలో ఆలస్యం అయ్యింది. ఎట్టకేలకు వచ్చే నెల నుండి సినిమా షూటింగ్‌ ప్రారంభం కాబోతుందని.. వచ్చే ఏడాదిలో సినిమా విడుదల కాబోతున్నట్లుగా కొత్త సంవత్సరం సందర్భంగా ప్రకటన వచ్చింది.

ఎన్టీఆర్‌ 30 తో పాటు జాన్వీ కపూర్‌ ఇప్పటికే మరో సినిమాలో కూడా కమిట్‌ అయ్యిందనే వార్తలు వస్తున్నాయి. ఆ సినిమా విషయమై అతి త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి జాన్వీ కపూర్‌ బ్యాక్ టు బ్యాక్ తెలుగు లో నటించబోతుంది. అయితే మాస్‌ హీరోయిన్ గా ఆమెకు ఎవరు ఎలివేషన్‌ ఇస్తారు అనేది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.