Begin typing your search above and press return to search.
#దళపతి 67 కోసం వంశీ పైడిపల్లి ఎంతకాలం ఆగాలి?
By: Tupaki Desk | 30 May 2021 4:30 PM GMTదళపతి విజయ్ తో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను లాక్ చేశాక.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఇటీవల నిరంతరం వార్తల్లో నిలుస్తున్నారు. విజయ్ తో అసాధారణ బడ్జెట్ తో ఈ సినిమా బహుభాషల్లో తెరకెక్కనుందని తెలియగానే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అందుకే అటు తమిళ పరిశ్రమ సహా ఇటు తెలుగు చిత్రసీమలోనూ దీనిపై ఆసక్తికర చర్చ సాగుతోంది.
అయితే పైడిపల్లి ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించడానికి ఎంత కాలం వేచి చూడాల్సి ఉంటుంది? అంటే.. దానిపై పూర్తి స్పష్ఠత రావాల్సి ఉంది. దళపతి విజయ్ తో సినిమా చేస్తున్నానని వంశీ స్వయంగా ధృవీకరించడంతో దీనిపై ఎంతో చర్చ సాగుతోంది. రామ్ చరణ్ - శంకర్ చిత్రం తర్వాత దిల్ రాజుకి ఇది రెండో తమిళ చిత్రం అవుతుంది. అయితే ఈ ప్రాజెక్ట్ కోసం వంశీ - దిల్ రాజు బృందం ఇంకా చాలా కాలం వేచి చూడాల్సి ఉంటుందని భావిస్తున్నారు.
విజయ్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో దళపతి 65లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. కరోనా వల్ల స్లో ఫేస్ లో ముందుకు సాగుతోంది. ఆ తర్వాత మాస్టర్ -ఖైదీ చిత్రాల దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో దళపతి 66 తెరకెక్కాల్సి ఉంది.
ఈ రెండిటి తర్వాతనే వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ #దళపతి 67 చిత్రీకరణకు వెళుతుంది. ప్రస్తుత చిత్రాల్ని పూర్తి చేసేందుకు విజయ్ కి ఇంకా ఏడాది పడుతుందా?.. అంటే ఇంకో ఏడాది పాటు పైడిపల్లి వేచి చూడాల్సి ఉంటుందా? అన్నది వేచి చూడాల్సి ఉంది. ఏదేమైనా దక్షిణాదిన అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ కు దర్శకత్వం వహించే అవకాశం వంశీ పైడిపల్లికి దక్కింది. ఇది తెలుగు వారు గర్వించదగిన ప్రాజెక్ట్ అవుతుందని భావిస్తున్నారు. మహర్షి లాంటి జాతీయ అవార్డ్ చిత్రాన్ని తెరకెక్కించిన వంశీ దళపతితో ఎలాంటి సినిమా తెరకెక్కిస్తారు? అన్నది ఉత్కంఠ పెంచుతోంది.