Begin typing your search above and press return to search.

ఎంతకాలానికి పెళ్లి.. పిల్లల గురించి క్లారిటీగా మాట్లాడింది

By:  Tupaki Desk   |   17 Oct 2022 4:36 AM GMT
ఎంతకాలానికి పెళ్లి.. పిల్లల గురించి క్లారిటీగా మాట్లాడింది
X
గ్లామర్ ప్రపంచంలో హీరోయిన్ల ఆయుష్షు చాలా తక్కువగా చెబుతుంటారు. అయితే.. అలాంటి లెక్కల్ని తప్పుగా తేల్చేసిన బ్యూటీలు ఈ మధ్యన ఎక్కువ అవుతున్నారు. ఇండస్ట్రీకి వచ్చి.. ఒక వెలుగు వెలిగి.. అంతలోనే కనిపించకుండాపోయిన భామలకు భిన్నంగా ఏళ్లకు ఏళ్లు కంటిన్యూ అవుతున్న వారిలో మిల్కీ బ్యూటీ తమన్నా ఒకరు. అప్పుడు ఇప్పుడు మిల్కీ బ్యూటీ అన్నంతనే గుర్తుకు వచ్చే తమన్నా భాటియా.. పదమూడేళ్ల చిరు ప్రాయం నుంచే సినిమాల్లో నటిస్తోంది.

ఇప్పుడు ఆమె వయసు 32 ఏళ్లపైనే. గ్లామర్ ప్రపంచంలో ఇంతకాలం కంటిన్యూ అవుతున్న అతి కొద్ది బ్యూటీల్లో తమన్నా ఒకరు. మిగిలిన హీరోయిన్ల మాదిరి గాసిప్స్ తన మీద రాకుండా ఆమె జాగ్రత్తలు తీసుకుంటుందని చెబుతారు. థర్టీకి దగ్గరకు వచ్చేసరికి హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకొని.. కాస్తంత గ్యాప్ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయటం ఈ మధ్యన చూస్తున్నాం. కానీ.. తమన్నా మాత్రం పెళ్లి ముచ్చటే తీసుకురాదు.

అలాంటి ఆమె తాజాగా తన తీరుకు భిన్నమైన మాటల్ని చెప్పుకొచ్చింది. తాను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పింది. పెళ్లికి సంబంధించిన ప్రస్తావనతో ఆపని ఆమె.. పిల్లల్ని కనాలనికూడా అనుకుంటున్నట్లు చెప్పి ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే.. పెళ్లి..

పిల్లల విషయాల్ని మాట్లాడేందుకు మక్కువ చూపని ఆమె.. ఇప్పుడు అందుకు భిన్నంగా ఒక్కసారిగా పెళ్లి.. పిల్లల్ని కనే విషయాన్ని తేల్చి చెప్పిన వైనం చూస్తే.. పెళ్లికి సంబంధించిన శుభవార్త త్వరలో షేర్ చేసుకోనుందా? అన్న సందేహం కలుగక మానదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.