Begin typing your search above and press return to search.
2019 మెగా హీరోలకు ప్లస్సా మైనస్సా?
By: Tupaki Desk | 24 Dec 2019 5:20 AM GMT2019 ముగించి 2020లో అడుగు పెడుతున్నాం. డిసెంబర్ 31 మిడ్ నైట్ ట్రీట్ కి ఇంకో ఆరురోజులే సమయం మిగిలి ఉంది. కొత్త సంవత్సరంలోకి కోటి ఆశలతో అడుగుపెడుతున్నాం. అయితే ఈ ఏడాదిలో మెగా ఫ్యామిలీ హీరోల సన్నివేశమేంటి? 2019 కలిసొచ్చిందా లేదా? అన్నది విశ్లేషిస్తే.. మిశ్రమ ఫలితమే దక్కిందని చెప్పొచ్చు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన `సైరా- నరసింహారెడ్డి` తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఇరుగు పొరుగు భాషల్లో అంతంత మాత్రమే అయినా చిరు-చరణ్ ఇద్దరూ సంతృప్తిని వ్యక్తం చేశారు. పాన్ ఇండియా కేటగిరీలో ఒక గొప్ప సినిమాని డాడ్ కి కానుకగా ఇచ్చారు చరణ్. ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీ 2019 ఎన్నికల్లో పోటీ చేసింది. పవన్ పోటీ చేసినా రెండుచోట్లా ఓటమి నిరాశపరిచింది. అయినా నీరుగారిపోకుండా జనసేన యాక్టివిటీస్ ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు పింక్ రీమేక్ తో టాలీవుడ్ లో రీఎంట్రీ ఇవ్వనున్నారని ప్రచారమవుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన `వినయ విధేయ రామా` 2019 బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా పంపిణీ వర్గాలకు తీవ్ర నష్టాల్నే మిగిల్చింది. బోయపాటి ఇమేజ్ కి ఊహించని డ్యామేజ్ ని కలగజేసింది. ఇక ఈ ఏడాది అంతా బన్ని స్క్రిప్టుల్ని ఫైనల్ చేయడంలోనే బిజీ. ప్రస్తుతం `అల వైకుంఠపురములో` చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా 2020 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. కొత్త సంవత్సరం అల్లు హీరోకి కలిసొస్తుందనే ఆశిద్దాం.
ఇక మెగా కాంపౌండ్ యువహీరోలు సాయి తేజ్ .. వరుణ్ తేజ్ సక్సెసయ్యారు. సాయి తేజ్ నటించిన చిత్రలహరి అతడి కెరీర్ లో కొంత ఊరట. ఈ ఉత్సాహంలోనే అతడు నటించిన `ప్రతిరోజూ పండగే` హిట్ టాక్ తెచ్చుకోవడంతో సాయి తేజ్ 2020ని కొత్తగా ప్రారంభించాలనే ప్లాన్ లో ఉన్నాడు. ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మెగా కాంపౌండ్ లోనే విలక్షణ నటుడిగా ముద్ర వేస్తూ ప్రయోగాత్మక కథాంశాల్ని ఎంచుకుని గట్స్ చూపిస్తున్నాడు. అతడు నటించిన ఎఫ్ 2 2019 సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇటీవలే గద్దల కొండ గణేష్ చిత్రంతో మరో విజయం అందుకున్నాడు. ఓవరాల్ గా వరుణ్ కి ఇది కలిసొచ్చిన సంవత్సరమే. ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యంలోని చిత్రంలో నటించాడు. ఇక కొత్త సంవత్సరంలో ఓటీటీ వేదికపై సత్తా చాటేందుకు అల్లు శిరీష్ ప్రయత్నిస్తున్నారని వార్తలొచ్చాయి. అలాగే కొన్ని సినిమాల్లో నటిస్తున్నా.. సడెన్ ట్రీట్ ఉంటుందని ఇంతకుముందు క్లూ ఇచ్చిన సంగతి తెలిసిందే.
2020 మెగా హీరోల ట్రీట్ ఎలా ఉండనుంది? అంటే.. తొలిగా బన్ని- అల వైకుంఠపురములో ట్రీట్ ఉంటుంది. అటుపై 2020 జూలై 31న ఆర్.ఆర్.ఆర్ చిత్రంతో పాన్ ఇండియా ట్రీట్ ని అందించనున్నాడు చరణ్. అదే ఏడాదిలో చిరు- పవన్ నటించే సినిమాలు రిలీజ్ కానున్నాయి. మెగా యువహీరోల సినిమాలు అభిమానుల ముందుకు రానున్నాయి.