Begin typing your search above and press return to search.

`మ‌న్మ‌థుడు 2` బ‌డ్జెట్ ఎంత‌?

By:  Tupaki Desk   |   25 March 2019 5:30 PM GMT
`మ‌న్మ‌థుడు 2` బ‌డ్జెట్ ఎంత‌?
X
కింగ్ నాగార్జున న‌టించిన మ‌న్మ‌ధుడు 20 డిసెంబ‌ర్ 2002లో రిలీజైంది. 18 సంవ‌త్స‌రాల‌కు ఈ సినిమాకి సీక్వెల్ తెర‌కెక్కిస్తున్నారు. అప్ప‌ట్లో విజ‌య‌భాస్క‌ర్ త‌న‌దైన మార్క్ కామెడీతో రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించిన తీరుకు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఇంత‌కాలానికి ఈ సినిమా సీక్వెల్ న‌వ‌త‌రం ద‌ర్శ‌కుడు రాహుల్ ర‌వీంద్ర‌న్ సార‌థ్యంలో తెర‌కెక్కుతోంది. గ‌త కొంత‌కాలంగా ఈ సినిమా ప్రారంభోత్స‌వం గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. మ‌ధ్య‌లో ఓసారి ఈ ప్రాజెక్టు లేన‌ట్టేన‌ని ఓ సెక్ష‌న్ మీడియా అత్యుత్సాహ‌ప‌డ‌డంపైనా అక్కినేని కాంపౌండ్ లో చ‌ర్చ సాగింది.

ఎట్ట‌కేల‌కు `మ‌న్మ‌థుడు` స్ఫూర్తితో `మన్మ‌ధుడు 2`ని ప్రారంభమైంది. మ‌నం ఎంట‌ర్ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ల‌పై నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్ (జెమిని కిర‌ణ్‌) సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేడు అన్న‌పూర్ణ స్టూడియోలో జ‌రిగిన ప్రారంభోత్స‌వంలో అక్కినేని అమ‌ల‌, నాగ‌చైత‌న్య ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు. అమ‌ల అక్కినేని ముహుర్త‌పు స‌న్నివేశానికి క్లాప్ కొట్ట‌గా.. అక్కినేని నాగ‌చైత‌న్య కెమెరా స్విచ్ఛాన్ చేశారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ‌ను యూర‌ప్‌ లో ప్రారంభిస్తున్నామ‌ని వెల్ల‌డించారు. ఆర్.ఎక్స్ 100 ఫేమ్ చైత‌న్య భ‌ర‌ద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండ‌గా, ఎం.సుకుమార్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

`మ‌న్మ‌ధుడు 2` బ‌డ్జెట్ గురించి ప్రారంభోత్స‌వాల వేళ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. `దేవ‌దాసు` త‌ర్వాత కింగ్ నాగార్జున ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా మంచి స్క్రిప్టు రెడీ చేయించుకుని మ‌రీ న‌టిస్తున్నారు. అందుకే సినిమా క్వాలిటీ విష‌యంలో ఏమాత్రం రాజీకి రాకుండా 20-25 కోట్ల మ‌ధ్య బ‌డ్జెట్ పెడుతున్నార‌ని తెలుస్తోంది. కింగ్ నాగార్జున కెరీర్ లో దేవ‌దాసు అత్యంత భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కింది. ఆ సినిమా కోసం రూ.50 కోట్ల బ‌డ్జెట్ ఖ‌ర్చ‌యింద‌ని అప్ప‌ట్లో ప్ర‌చార‌మైంది. ఆ త‌ర్వ‌త డ‌మ‌రుకం చిత్రానికి ఏకంగా 40 కోట్ల బ‌డ్జెట్ వెచ్చించారు. శ్రీ‌నివాస్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో విజువ‌ల్ గ్రాఫిక్స్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఢ‌మ‌రుకం ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో వాయిదా ప‌డుతూ రిలీజై తిరిగి బ‌డ్జెట్ ని రిక‌వ‌రీ చేసింది. ఇక దేవ‌దాస్ చిత్రం హిట్ టాక్ తెచ్చుకున్నా ఓవ‌ర్ బ‌డ్జెట్ వ‌ల్ల ఆ స్థాయి వ‌సూళ్లు తేలేక‌పోయింద‌ని విమ‌ర్శ‌లొచ్చాయి. ఇలాంటి స‌మ‌యంలో ఒక అప్ క‌మ్ ద‌ర్శ‌కుడిని న‌మ్మి నాగార్జున అంత బ‌డ్జెట్ పెడుతున్నారా? అంటూ చ‌ర్చ సాగింది. చి.ల‌.సౌ లాంటి చిన్న బ‌డ్జెట్ సినిమా తెర‌కెక్కించి మెప్పించిన రాహుల్ ర‌వీంద్ర‌న్ ఈసారి పెద్ద బ‌డ్జెట్ తో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి అంటూ ముచ్చ‌ట సాగుతోంది. మ‌న్మ‌ధుడు త‌ర‌హాలో క్లాసిక్ హిట్ ఇస్తాడా? అన్న‌ది వేచి చూడాలి. ఇక‌పోతే నాగార్జున ప్ర‌స్తుతం వ‌రుస‌గా సీక్వెల్ సినిమాల‌పై ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. `మ‌న్మ‌ధుడు 2` తొలిగా ప్రారంభ‌మైంది. తదుప‌రి `బంగార్రాజు` (సోగ్గాడే సీక్వెల్), రాజుగారి గ‌ది 3 సినిమాల గురించి ఫిలింన‌గ‌ర్ లో ఆస‌క్తిక‌ర‌ చ‌ర్చ సాగుతోంది.