Begin typing your search above and press return to search.

అజ‌య్ అంత డిమాండ్ చేశాడా?

By:  Tupaki Desk   |   11 Jan 2022 1:30 PM GMT
అజ‌య్ అంత డిమాండ్ చేశాడా?
X
ఇండియ‌న్ తెర‌పై జ‌క్క‌న్న రాజ‌మౌళి ఆవిష్క‌రించిన అద్భుతం `RRR`. భార‌తీయ సినీ చ‌రిత్ర‌లోనే క‌నీవినీ ఎరుగ‌ని భారీ బ‌డ్జెట్ తో ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూస‌ర్ డీవీవీ దాన‌య్య నిర్మించారు. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తొలిసారి క‌లిసి న‌టించిన ఈ పాన్ ఇండియా మూవీ తొలి నుంచి వార్త‌ల్లో నిలుస్తూ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారుతోంది. బడ్జెట్ ప‌రంగానూ, ఆర్టిస్ట్ ల ప‌రంగానూ, స్టోరీ ప‌రంగానూ వార్త‌ల్లో నిలిచింది.

ప్ర‌మోష‌న్స్ కే 20 కోట్లు ఖ‌ర్చు చేసి వార్త‌ల్లో నిలిచిన ఈ మూవీ ఈ జ‌న‌వ‌రి 7న సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కావాల్సిన విష‌యం తెలిసిందే. కానీ దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్‌, కోవిడ్ ఉగ్రరూపం దాల్చ‌డంతో ప‌రిస్థితులు ఒక్క‌సారిగా మారిపోయాయి. దీంతో ఈ మూవీ రిలీజ్ ని మేక‌ర్స్ అర్థాంత‌రంగా వాయిదా వేయాల్సి వ‌చ్చింది. ఈ వార్త‌తో అభిమానుల్ని, సినీ ప్రియుల్ని నిరాశ‌ప‌రిచిన `RRR` తాజాగా మ‌రో సారి వార్త‌ల్లో నిలిచింది.

ఈ చిత్రంలో న‌టించిన కీల‌క న‌టీన‌టుల రెమ్యున‌రేష‌న్ లు తాజాగా లీక‌య్యాయి. దీంతో మ‌రోసారి `RRR` వార్త‌ల్లో నిలిచింది. అయితే ఇందులో అతిథి పాత్ర‌లో న‌టించిన న‌టుడికే షాకింగ్ రెమ్యున‌రేష‌న్ ఇవ్వ‌డం ఇప్ప‌డు హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోలుగా న‌టించారు. వీరికి జోడీగా అలియాభ‌ట్‌, హాలీవుడ్ న‌టి ఒలివియా మోరిస్ క‌నిపించ‌నున్నారు. కీల‌క అతిథి పాత్ర‌లో బాలీవుడ్ న‌టుడు అజ‌య్ దేవ‌గ‌న్ న‌టించిన విష‌యం తెలిసిందే.

ఈ చిత్రం కోసం రామ్ చ‌ర‌ణ్ , ఎన్టీఆర్ ఇద్ద‌రు క‌లిపి 75 కోట్లు పారితోషికం తీసుకున్నారు. ఇప్ప‌టికే వారికి 40 అంద‌జేశారు. మిగ‌తా మొత్తం రిలీజ్ స‌మ‌యంలో ఇవ్వాల్సి వుంది. అయితే కీల‌క అతిథి పాత్ర‌లో న‌టించిన అజ‌య్ దేవ‌గ‌న్ కి 35 కోట్లు పారితోషికం ఇచ్చార‌ట‌. ఇప్ప‌టికే ఆయ‌న‌కు మొత్తం రెమ్యున‌రేష‌న్ అందిన‌ట్టుగా చెబుతున్నారు.

ఇక అలియా భ‌ట్ కు 9 కోట్లు ఇచ్చార‌ట‌. ఆమె పాత్ర సినిమాలో క‌నిపించేది కేవ‌లం 20 నిమిసాలు మాత్ర‌మే . 20 నిమిషాల పాత్ర‌కే 9 కోట్లు ఇవ్వ‌డం, అయ్ దేవ‌గ‌న్ చేసిన అతిథి పాత్ర‌కు 35 కోట్లు ఇవ్వ‌డం ఇప్పుడు ట్రేడ్ వ‌ర్గాల్లో హ‌ట్ టాపిక్ గా మారింది. అంతే కాకుండా ఈ సినిమా బిజినెస్, ప్రాఫిట్ ల‌కు సంబంధించిన ఓ ఆస‌క్తిక‌ర‌మైన వార్త కూడా ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ముందు చేసుకున్న ఒప్పందం ప్ర‌కారం నిర్మాత దాన‌య్య100 కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకోవాలి. రాజ‌మౌళి 200 కోట్లు షేర్ తీసుకోవాలి. అయితే గ‌త కొన్ని నెలలుగా `RRR` రిలీజ్ ప‌లు ధ‌పాలుగా వాయిదాల మీద వాయిదాలు ప‌డుతూ వ‌స్తున్న నేప‌థ్యంలో దాన‌య్య ప్రాపిట్ లో 50 కోట్లు, రాజ‌మౌళి త‌ను అందుకోనున్న 200 కోట్ల ప్రాఫిట్ లో 100 కోట్లు న‌ష్టాపోవాల్సి వ‌చ్చింద‌ని తెలిసింది. తాజా పరిణామాల నేఫ‌థ్యంలో ఈ మూవీ వీలైనంత త్వ‌ర‌గా థియేట‌ర్ల‌లో విడుద‌లైతేనే డైరెక్ట‌ర్ , నిర్మాత లాభాలు చూస్తార‌ని లేదంటే క‌ష్ట‌మ‌నే వాద‌న‌లు వినిపిస్తున్నాయి.