Begin typing your search above and press return to search.
'RRR' వల్ల ఎన్టీఆర్ కోల్పోయింది ఎంత?
By: Tupaki Desk | 6 Jan 2022 1:30 PM GMTదర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన భారీ మల్టీస్టారర్ `ఆర్ ఆర్ ఆర్`. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలిసారి కలిసి నటించారు. అంతే కాకుండా చరిత్రలో మిగిలిపోచిన ఇద్దరు రియల్ హీరోలు అల్లూరి సీతారామరాజు, కొమురం భీంల కథకు ఫిక్షనల్ అంశాలు జోడించి ఈ మూవీ చేశారు. దీంతో ఏంటీ ఈ ఇద్దరు కలిసి ఫైట్ చేశారా? .. ఆ కథ ఎలా వుంటుంది? అనే ఆసక్తి ప్రతీ ఒక్కరిలోనూ పెరిగింది.
దీంతో `ఆర్ ఆర్ ఆర్`పై సహజంగానే అంచనాలు ఆకాశాన్నంటాయి. అయితే ఈ మూవీ అనూహ్యంగా జనవరి 7న విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఈ భారీ మల్టీస్టారర్ కారణంగా హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పొందిన దాని కంటే పోగొట్టుకుందే ఎక్కువని చెబుతున్నారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ మూడేళ్లుగా ఎదురుచూస్తున్నారు. మరో సినిమా చేయలేదు. కేవలం ఈ సినిమాకే తన డేట్స్ మొత్తం కేటాయించారు.
అంతే కాకుండా ఈ మూవీ టైమ్ లో మరో సినిమా చేయొద్దనే రాజమౌళి కండీషన్ కు కట్టుబడి మూడేళ్లు దీనికే కేటాయించారు. దీంతో ఏడాది కనీసం ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ఎన్టీఆర్ మూడేళ్లు గడుస్తున్నా ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాలేకపోయాడు. ఇది ఆయనకు పెద్ద డ్రా బ్యాక్ గా మారింది. 2018లో ఎన్టీఆర్ `అరవింద సమేత` చిత్రం చేశారు. ఆ తరువాత ఆయన నుంచి మరో సినిమా రాలేదు.
దీంతో ఆయన కర్యాలెండర్ లోని 19, 20, 21 ఇయర్స్ వృధాగా గడిచిపోయాయి. ఏడాదికి ఒక సినిమాకి 25 నుంచి 30 కోట్లు తీసుకునే ఎన్టీఆర్ `ఆర్ ఆర్ ఆర్`కు మూడేళ్లు కేటాయించి కేవలం 50 కోట్లు మాత్రమే దక్కించుకున్నారట. అంటే ఏడాదికి ఒక సినిమా చొప్పున చేసి వుంటే మూడేళ్లకు గానూ ఆయన సినిమాలు చేసి వుంటే 150 కోట్లు పారితోషికం అందుకునే వారు కానీ `ఆర్ ఆర్ ఆర్` వల్ల దాదాపు 100 కోట్లు ఆయన నష్టపోయినట్టుగా స్పష్టమవుతోంది.
`ఆర్ ఆర్ ఆర్` వల్ల జరిగిన తప్పిదాన్ని సరిదిద్దుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు ఎన్టీఆర్. ఇందులో భాగంగానే కొరటాల శివ, ప్రశాంత్ నీల్, బుచ్చిబాబు సానా, త్రివిక్రమ్ ల చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. వీటిని సాధ్యమైనంత త్వరలో పూర్తి చేయాలని భావిస్తున్నారట. ఇందులో ఒకటి రెండు చిత్రాలని రాకెట్ స్పీడుతో పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారట. ముందుగా కొరటాల శివ చిత్రాన్ని పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ లతో `ఆచార్య` చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి చిత్రాన్ని ఫిబ్రవరి 4న రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ పూర్తి కావడంతో కొరటాల శి తన ఫోకస్ ని ఎన్టీఆర్ సినిమా వైపు మళ్లించి సినిమా పనుల్లో నిమగ్నం కానున్నారట.