Begin typing your search above and press return to search.
స్టార్ డైరెక్టర్ షాకింగ్ లైఫ్ స్టైల్
By: Tupaki Desk | 11 Aug 2019 1:30 AM GMTభారీ బడ్జెట్లతో అధునాతన సాంకేతికత విలువలతో విజువల్ వండర్స్ ని తెరకెక్కించిన మేటి దర్శకుడు శంకర్. అతడి లైఫ్ స్టైల్ కూడా తను తెరకెక్కించే సినిమాల స్థాయిలోనే గ్రాండియర్ గానే వుంటుందన్నది ఎందరికి తెలుసు? యావత్ భారతీయ సినీ ప్రేమికుల్ని సౌత్ ఇండియన్ సినిమాల వైపు ఆసక్తిగా తిరిగి చూసేలా చేసిన సెల్యూలాయిడ్ మాంత్రికుడి లైఫ్ స్టైల్ గురించి.. ఆయన ఉపయోగించే కార్ల గురించి.. ఆస్తుల గురించి తెలుసుకుంటే చాలానే ఆసక్తికర సంగతులు ఉన్నాయి.
అసలు పేరు శంకర్ షణ్ముగం. 17 ఆగస్టు 1963లో చెన్నైలోని కుంభకోణంలో జన్మించారు. సినిమాపై వున్న మమకారంతో తొలుత ఆర్టిస్ట్ గా ప్రయత్నించారు. ఆర్. నారాయణమూర్తి కెరీర్ తొలి నాళ్లలో చిన్నా చితకా వేశాలు వేసినట్టే.. శంకర్ కూడా అసిస్టెంట్ల పాత్రల్లో నటించారు. ఆ తరువాత రైటర్ గా మారి కొన్ని చిత్రాలకు పనిచేశారు. ఎంతకూ గుర్తింపు లభించకపోవడంతో తానే స్వయంగా `జెంటిల్ మేన్` కథని సిద్ధం చేసుకుని రంగంలోకి దిగారు. ఎంత వయసు పెరిగినా తన హెయిర్ కలర్ ని మాత్రం ఎప్పుడూ ప్యూర్ బ్లాక్ కలర్ తో మెరిసిపోయేలా చూసుకుంటూ వుంటారు. 2017 వరకు దర్శకుడిగా ఆయన పారితోషికం 32 కోట్లు. ఇప్పటి వరకూ ఆయన ఆస్టుల విలువ 116 కోట్లు.
శంకర్ సినీ టెక్నీలజీ మీద పట్టు సాధించడానికి ప్రధాన కారణం ఆయనో ఇంజినీర్ కావడమే. మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేసిన శంకర్ తన సినిమాల్ని సాంకేతికంగా అత్యున్నతంగా ప్లాన్ చేస్తుంటారు. ఇక ఆయన వద్ద ఖరీదైన కార్ల కలెక్షన్ చూస్తే మతిపోవాల్సిందే. అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ ఘోస్ట్ కార్ అంటే ఆయన అమితంగా ఇష్టపడతారు. ఆయన భార్య ఈశ్వరి. వీరికి ముగ్గురు సంతానం. ఇద్దరు అమ్మాయిలు ఐశ్వర్య శంకర్, అదితి శంకర్. ఓ కొడుకు ఆర్జిత్ శంకర్ వున్నారు. వాళ్లే శంకర్ కు సర్వస్వం. ఎస్ పిక్చర్ బ్యానర్ స్థాపించిన శంకర్ చిన్న తరహా కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలను నిర్మించడం హాబీగా పెట్టుకున్నారు. కాదల్ (ప్రేమిస్తే), ఆది పినిశెట్టి నటించిన `ఈరమ్` వంటి అద్భుతమైన చిత్రాల్ని నిర్మించి నిర్మాతగా తన అభిరుచిని చాటుకున్నారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో `భారతీయుడు 2` సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. భారతీయుడు చిత్రానికి సీక్వెల్ ఇది. 2.0 తర్వాత శంకర్ రూపొందిస్తున్న భారీ చిత్రమిది.