Begin typing your search above and press return to search.
సైరా బిజినెస్ టార్గెట్ ఎంత ?
By: Tupaki Desk | 4 July 2019 4:44 AM GMTప్రస్తుతానికి ఎలాంటి సౌండ్ లేదు కాని ఇంకో నెల రోజుల్లో సైరా సందడి మొదలుకానుంది. ప్రమోషన్ ని ఇంకో మూడు నాలుగు వారాల తర్వాత చేయాలని నిర్మాత రామ్ చరణ్ డిసైడ్ అయినట్టుగా ఇప్పటికే ఇన్ సైడ్ టాక్ ఉంది. మరోపక్క బిజినెస్ డీల్స్ కూడా జరిగిపోతున్నాయి. కర్ణాటక రైట్స్ అమ్మేశారు. తమిళనాడు కేరళ రేపో మాపో ఫైనల్ అవుతాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఏరియాలకు చర్చలు ప్రతిపాదన దశలో ఉన్నాయి. కొత్త ట్రైలర్ లేదా టీజర్ వదిలి ఆ తర్వాత వీటిని ఫైనల్ చేయొచ్చనే మాట వినిపిస్తోంది.
సాహో ఫీవర్ మొదలయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఆ హడావిడిలో సైరా గురించి ప్రచారం చేయడం ఎందుకని సైలెంట్ గా ఉన్నట్టు తెలిసింది. దానికి తోడు ఇండియా టీమ్ ఫైనల్ గా వెళ్లే అవకాశం ఉండటంతో అందరి మూడ్ వరల్డ్ కప్ మీదే ఉంది. అందుకే సినిమాల ప్రచారాన్ని జనం పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో హైప్ తెచ్చే ప్రయత్నం చేయడం అంతగా వర్క్ అవుట్ కాదు
ఇకపోతే సైరా బిజినెస్ టార్గెట్ ఎంత అనేదాని గురించి ట్రేడ్ లో భారీ చర్చలు జరుగుతున్నాయి. ఖైదీ నెంబర్ 150 లాంటి రెగ్యులర్ కమర్షియల్ సినిమా వంద కోట్ల షేర్ రాబట్టే సత్తా ఉన్నప్పుడు మల్టీ లాంగ్వేజ్ లో వస్తున్న సైరా అంతకు రెట్టింపు వస్తుందనే నమ్మకంతో చరణ్ ఉన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. రంగస్థలం 120 కోట్ల దాకా రీచ్ అయ్యింది. కొంత డివైడ్ టాక్ ఉన్నా మహర్షి 102 కోట్ల దాకా వెళ్ళాడు.
సో టాలీవుడ్ మాగ్నమ్ ఓపస్ గా చెప్పుకుంటున్న సైరా అన్ని భాషలు కలిపి చాలా సులువుగా 200 కోట్ల టార్గెట్ చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. బాహుబలి రేంజ్ టాక్ వస్తే ఆకాశమే హద్దుగా పెట్టుకోవచ్చు. ఓవర్సీస్ మార్కెట్ మీద చాలా లెక్కలు వేస్తున్నారు. చిరు కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా రూపొందుతున్న సైరా సంచలనాలకు ఇంకో మూడు నెలలు వేచి చూడాల్సిందే