Begin typing your search above and press return to search.
హరిహర వీరమళ్లు.. ఇంకా ఎన్నాళ్ళిలా?
By: Tupaki Desk | 12 July 2022 12:30 AM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటిసారి ఒక చారిత్రాత్మక నేపథ్యం ఉన్న సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో మొదలుపెట్టిన హరిహర వీరమల్లు సినిమా అనౌన్స్మెంట్ ద్వారానే అభిమానులలో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. తప్పకుండా ఈ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవుతుంది అని అప్పట్లో అభిమానులు ఎంతగానో సంతోషపడ్డారు.
అయితే ఈ సినిమా ప్రకటించినప్పుడు ఉన్న హైప్ ఇప్పుడు లేదు అనే చెప్పాలి. పవర్ స్టార్ ఎంతో ఎనర్జీటిక్ గా ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టినప్పటికీ ఆ తర్వాత వివిధ కారణాల వలన ఒక వైపు రాజకీయాలతో మరోవైపు చిన్న సినిమాల షూటింగ్స్ వలన చాలా సార్లు షూటింగ్ బ్రేక్ పడింది. అసలైతే 2022 దసరా సమయంలోనే ఈ సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు.
ఇక ఆ తర్వాత డిసెంబర్ లో కూడా విడుదల చేయాలని దర్శకుడు ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నాడు. కానీ అవి కూడా వర్కవుట్ కాలేదు. 2023 సంక్రాంతికి అయినా వస్తుంది అనుకొని చిత్ర యూనిట్ ఒక సమయంలో నమ్మకం గానే చెప్పింది.
కానీ ఆ ప్లాన్ కూడా వర్కౌట్ కాలేదు. ఒక వైపు కరోనా కారణంగా చాలా సార్లు వాయిదా పడ్డా ఈ సినిమా షూటింగ్ మరో వైపు పవన్ కళ్యాణ్ పొలిటికల్ బిజీ షెడ్యూల్ తో షూటింగ్ కు బ్రేకులు పడ్డాయి.
ఇక ఇప్పుడు కనీసం సమ్మర్లో విడుదల చేస్తాం అని అనుకుంటే పెద్ద హీరోల సినిమాలు ఆ సమయానికి రిలీజ్ డేట్స్ ను సొంతం చేసుకునే పనిలో బిజీ అయ్యారు. ఇప్పటి వరకు ఈ సినిమా షూటింగ్ కంటిన్యూగా అసలు కొనసాగింది లేదు. ఏదో బిట్లు బిట్లుగా మాత్రమే దర్శకుడు సమయాన్ని బట్టి షూటింగ్ చేసుకుంటూ వస్తున్నాడు.
ఈ విషయంలో ఎవరిని తప్పు పట్టాలి అనేది నిర్మాత దర్శకుడు కూడా అర్థం కావడం లేదు. మరి ఈ తరహాలో కొనసాగితే సినిమా అసలు పూర్తి అవుతుందా లేదా అనేది కూడా సందేహంగా మారింది. ఇక ఈ విషయంలో చిత్ర యూనిట్ ఒక సీరియస్ డిసిషన్ తీసుకోవాల్సిందే అని ఓ వర్గం అభిమానులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.