Begin typing your search above and press return to search.

నిత్య వల్ల ఒక్కటైన ప్రేమ జంట

By:  Tupaki Desk   |   3 May 2019 9:59 AM GMT
నిత్య వల్ల ఒక్కటైన ప్రేమ జంట
X
తెరమీదే కాదు వెనుక కూడా ఊహకందని ఎన్నో ప్రేమ కథలు పరిశ్రమలో జరుగుతూ ఉంటాయి.. కొన్ని పెళ్లి పీటల దాకా వెళ్తే మరికొన్ని బ్రేకప్ దశలోనే ఆగిపోతున్నాయి. కాని ఊహించని విధంగా ఒక సినిమా ఆఫర్ వదులుకున్నందుకు ఓ లవ్ స్టొరీకి తాను కారణం కావడాన్ని షేర్ చేసుకుంది నిత్యా మీనన్. రాజు రాణి సినిమా చూసారుగా. అందులో ఆర్య నయనతార ఒక జంట అయితే జై నజ్రియా మరో జంట.

ఈ నజ్రియా ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడానికి నిత్యనే కారణమట. అదెలాగో చూడండి. బెంగుళూరు డేస్ సినిమా మలయాళంలో ఎంత పెద్ద బ్లాక్ బస్టరో తెలిసిందే. ఇందులో ఓ హీరొయిన్ గా నిత్య మీనన్ ను అనుకున్నారు. అందులో ఫాహత్ ఫాజిల్ అప్పటికే ఎంపికయ్యి ఉన్నాడు. కాల్ షీట్స్ సమస్య వల్ల నిత్య ఆ పాత్రను వదులుకుంది.

అది కాస్తా నజ్రియను వరించింది. ఇంకేముంది షూటింగ్ టైం లో ఫాహత్ ఫాజిల్ నజ్రియా ప్రేమలో పడిపోయారు. కట్ చేస్తే పెళ్లి జరిగిపోయి ఇద్దరూ హ్యాపీగా ఉన్నారు. దాని కన్నా ముందు ఈ జంట కలిసి నటించిందే లేదు. ఒకవేళ తాను ఆ సినిమా ఒప్పుకుని ఉంటె బెంగుళూరు డేస్ లో నజ్రియ ఉండేది కాదని అప్పుడు ఫాహత్ తో ప్రేమ అనే ప్రసక్తే వచ్చేది కాదని చెబుతోంది నిత్య.

పెళ్ళిళ్ళు ముందే నిర్ణయంచబడతాయని చెప్పడానికి ఇంత కన్నా ఉదాహరణ ఏం కావాలని చెబుతోంది. తన మాటల్లో నిజం ఉంది మరి. అదేదో విధి లిఖితం అన్నట్టు నిత్య ఆఫర్ వద్దనుకోవడమే వీళ్ళ ప్రేమకు ఆ తర్వాత పెళ్లి కథకు పునాది పడినట్టు అయ్యింది.