Begin typing your search above and press return to search.
'ఆర్ ఆర్ ఆర్'లో ఎన్టీఆర్ - చరణ్ కలిసేదెలా..?
By: Tupaki Desk | 30 March 2020 1:30 PM GMT'ఆర్ఆర్ఆర్' దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం. స్టార్ హీరోలు రాంచరణ్, ఎన్టీఆర్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో రూపొందిస్తున్న ఈ సినిమా పై ప్రేక్షకుల అంచనాలు రోజురోజుకి అందలాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే మోషన్ పోస్టర్ తో ఆకట్టుకున్న రాజమౌళి, తాజాగా రాంచరణ్ అల్లూరి లుక్ ని రివీల్ చేసి ప్రపంచం దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు. ఇక రీసెంట్ గా రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ కలిస్తే ఎలా ఉంటుందో చూపిస్తా అన్నాడు.
అంతే.. ప్రేక్షకుల లో ఎక్కడా లేని క్యూరియాసిటీ మొదలైంది. నిజానికి అల్లూరి, కొమరం భీమ్ లకి ఒకరికొకరు తెలియదు. అలాంటిది వారిద్దరి జీవితాల ఆధారంగా సినిమా తీయడమే పెద్ద సవాల్ అంటే.. అసలు వాళ్లిద్దరూ కలిసి బ్రిటిష్ వారిపై పోరాటం ఎలా చేసాడో.. చూపిస్తా అన్నాడు. అప్పటినుండి దేశ వ్యాప్తంగా సినీ అభిమానుల లో ఎన్నడూ లేని సందేహాలు కలుగుతున్నాయి. ఆ మూలన ఉన్న అల్లూరిని, ఈ మూలన ఉన్న కొమరం ని ఎలా కలుపుతాడో అని ఒకటే చర్చ. ఇదిగాక ఇప్పటికే రాంచరణ్ పాత్ర లుక్ ని విడుదల చేయడంతో ఎన్టీఆర్ లుక్ కోసం అభిమానులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. దీనిపై కూడా రాజమౌళి స్పందించి ఎన్టీఆర్ లుక్ మే నెల 20న విడుదల చేస్తాడట. ఇంటర్నేషనల్ రేంజ్ లో రూపొందిస్తున్న ఈ సినిమాను దానయ్య నిర్మిస్తుండగా, ఎంఎం కీరవాణి సంగీత సారధ్యం వహిస్తున్నారు.