Begin typing your search above and press return to search.
చరణ్ ఇంత గుడ్డిగా ఎలా నమ్మేశాడో?
By: Tupaki Desk | 12 Jan 2019 6:42 AM GMTమెగా ఫ్యాన్స్ ముందుకు నిన్న వచ్చిన 'వినయ విధేయ రామ' చిత్రం తిరష్కరణకు గురైందని చెప్పక తప్పదు. ఆ విషయాన్ని మెగా ఫ్యాన్స్ కూడా ఒప్పుకుంటున్నారు. ఒక కథ లేదు, హీరో పాత్రకు స్కోప్ లేదు, యాక్షన్ ఎలిమెంట్స్ మరీ ఫన్నీగా ఉన్నాయి. అంత మంది ఉన్న కథను దర్శకుడు బోయపాటి గందరగోళంగా నడిపాడు. ముఖ్యంగా స్క్రీన్ ప్లే అంతా కూడా కన్ఫ్యూజ్ గా సాగింది. అసలు రామ్ చరణ్ ఇలాంటి కథకు ఎలా కమిట్ అయ్యాడంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
చరణ్ గత చిత్రాలను తీసుకుంటే 'ధృవ' మరియు 'రంగస్థలం' చిత్రాల్లో హీరో పాత్రకు అత్యంత ప్రాముఖ్యత ఉండటంతో పాటు, నటనకు ఎక్కువ ఆస్కారం ఉన్న పాత్రలు దక్కాయి. చరణ్ నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు ఎంపిక చేసుకుని మంచి నటనతో ఆకట్టుకున్నాడు. మరి ఈ చిత్రంలో మాత్రం నటనకు పెద్దగా ఆస్కారం లేదు. అయినా కూడా ఎందుకు ఈ పాత్రను ఎంపిక చేసుకున్నాడో అర్థం కావడం లేదు.
బోయపాటిపై నమ్మకంతో చరణ్ ఈ సినిమాను చేసినట్లుగా అనిపిస్తుంది. ఎంత నమ్మకం ఉన్నా కూడా మరీ కథ, తన పాత్ర విషయంలో ఎలా ఇంత గడ్డిగా నిర్ణయం తీసుకున్నాడో ఆయనకే తెలియాలి. బోయపాటి మూవీ అనగానే మాస్ ఆడియన్స్ ను తప్పకుండా ఆకట్టుకోవచ్చు అనుకున్నాడేమో, చరణ్ ఈ సినిమాను చేసినట్లున్నాడు. #RRR మూవీకి ముందు చరణ్ ఇలాంటి సినిమాతో రావడం మెగా ఫ్యాన్స్ ను తీవ్ర నిరాశతో ఉన్నారు.