Begin typing your search above and press return to search.

సంజు వెనుక కష్టం కథ

By:  Tupaki Desk   |   6 July 2018 5:49 PM GMT
సంజు వెనుక కష్టం కథ
X
గత వారం విడుదలై బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న సంజు మీద కొన్ని విమర్శలు ఉన్నప్పటికీ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను మాయలో పడేస్తోంది. బలమైన పోటీ ఏది లేని నేపథ్యంలో ముఖ్యంగా ఎ సెంటర్స్ లో దూసుకుపోతున్నాడు సంజు. ఇది సంజయ్ దత్ కథగా కంటే తండ్రి కొడుకుల అనుబంధాన్ని స్నేహితుల మధ్య బాండింగ్ ని అద్భుతంగా చూపించిన సినిమాగానే మెప్పు పొందుతోంది. అందరి కంటే ఎక్కువ ప్రశంశలకు అర్హుడు ముమ్మాటికీ హీరో రన్బీర్ కపూరే.

తాజాగా తను సంజయ్ దత్ గా మారడానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందో వివరిస్తూ తయారు చేసిన వీడియో ఇప్పుడు యు ట్యూబ్ లో హల్చల్ చేస్తోంది. ఏదో మేకప్ ద్వారా మేనేజ్ చేసిన తేలికపాటి వ్యవహారంలా కనిపించినా దాని వెనుక ఎంత కష్టం ఉందొ ఇందులో చూపడం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. రన్బీర్ కపూర్ సంజుగా సూట్ అవుతాడా లేదా అని చెక్ చేయడానికి కొన్ని గంటల పాటు ఫోటో షూట్లు చేసారు. మొదట ఏది సెట్ కాలేదు. ఫిజిక్ పరంగా కూడా రన్బీర్ కపూర్ లో సంజయ్ దత్ ఫీచర్స్ లేకపోవడంతో అదేపనిగా ట్రైనర్ ను అపాయింట్ చేసి జిమ్ లో కఠినమైన ట్రైనింగ్ ఇప్పించారు. రోజుకు ఎనిమిది సార్లు తింటూ రన్బీర్ కండలు పెంచాల్సి వచ్చింది. తెల్లవారకుండానే 3 గంటల సమయంలో రోజూ ప్రోటీన్ షేక్ తాగాల్సి వచ్చేది. మళ్ళి జీవితంలో ఇలాంటి కసరత్తు చేస్తానా అని రన్బీర్ కే డౌట్ వచ్చింది. విదేశాల నుంచి వచ్చిన నిపుణుల ద్వారా మేకప్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకున్నారు.

క్లైమాక్స్ లో జైలు నుంచి బయటికి వచ్చే సీన్ లో వయసు మళ్ళిన గెటప్ లో రన్బీర్ ను చూసాకే రాజ్ కుమార్ హిరానీకి నమ్మకం కలిగింది. అలా ఏడాది పాటు హోమ్ వర్క్ చేసాక ఫైనల్ గా సెట్స్ పైకి తీసుకెళ్లారు. ఈ విశేషాలన్నీ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ నిర్మాత విధు వినోద్ చోప్రాతో పాటు హీరో రన్బీర్ కపూర్ ఈ వీడియోలో స్వయంగా పంచుకున్నారు. తెరవెనుక ఎంత కష్టమో తెలియాలంటే మీరూ ఓ లుక్ వేసేయండి.