Begin typing your search above and press return to search.
వ్యాక్సిన్ వేళ..సీనియర్ నటి ఎంతలా భయపడిందంటే?
By: Tupaki Desk | 19 July 2021 4:40 AM GMTసూది మందు.. చాలామందికి ఏ మాత్రం ఇష్టం ఉండదు. అందుకే.. ఏదైనా జబ్బు చేసినప్పుడు ఇంజెక్షన్ ఇస్తానంటే.. ట్యాబ్లెట్ ఏమీ ఉండదా? అంటూ అడిగేటోళ్లు చాలామందే కనిపిస్తారు. మాయదారి కరోనా పుణ్యమా అని.. ఇంజెక్షన్ అంటే భయం ఉన్న వారందరికి టీకా మేళ చుక్కలు చూపిస్తోంది. టీకా వేయించుకోవటం కోసం వారు పడే భయాందోళనలు అంతా ఇంతా కాదు. సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకు సూదిమందు భయాన్ని చూస్తే ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
చావుముఖం చూసి వచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు సైతం సూదిమందు అంటే ఏ మాత్రం ఇష్టపడరు. సూది మందును తప్పించుకోవటం కోసం ఆయన తెగ ప్రయత్నిస్తారని ఆయన సన్నిహితులు చెబుతారు. ఇలా.. ఇంజెక్షన్ అంటే భయపడే వారి జాబితాలో తాజాగా సీనియర్ నటి.. అందాల బొమ్మ స్నేహ చేరారు. తాజాగా ఆమె కరోనాకు చెక్ పెట్టే వ్యాక్సిన్ వేయించుకునే వేళలో.. భయపడిన వైనం చూస్తే నవ్వు ఆపుకోలేని పరిస్థితి.
ఆమెకు టీకా వేయటం కోసం వ్యాక్సిన్ సిబ్బంది కాస్త ఇబ్బందికి గురయ్యారు. ముఖానికి మాస్కు పెట్టుకొని టీకా వేసుకోవటానికి సిద్ధమైనా.. సూది దగ్గరకు వచ్చేసరికి వెనక్కి వెళ్లటం.. మళ్లీ ముందుకు రావటం.. సూది చేతికి దగ్గరకు రాగానే.. ఇంజెక్షన్ కు ఆమె భయపడిన వైనాన్ని ఆమెకు దగ్గరగా ఉన్న భర్త ప్రసన్న స్వయంగా వీడియో తీశారు. తాజాగా దీన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వ్యాక్సిన్ అంటే.. స్నేహకు మరీ ఇంత భయమా అన్న భావన కలిగేలా ఉన్న ఈ వీడియోలో.. చివరకు హమ్మయ్య మొదటి వ్యాక్సిన్ విజయవంతంగా పూర్తి అయ్యిందన్న మాట విన్నంతనే.. మరీ ఇంత ఆలస్యంగా టీకా వేయించుకోవటం ఏమిటన్న సందేహం కలుగక మానదు. ఇంకెందుకు ఆలస్యం.. వీడియో చూసి ఎంజాయ్ చేసేయండి.