Begin typing your search above and press return to search.

ఓటీటీలో 'హిట్టు బొమ్మ'కి స‌రైన నిర్వ‌చ‌నం ఏంటి...?

By:  Tupaki Desk   |   28 Sep 2020 5:37 PM GMT
ఓటీటీలో హిట్టు బొమ్మకి స‌రైన నిర్వ‌చ‌నం ఏంటి...?
X
కరోనా కారణంగా గత ఆరున్నర నెలలుగా థియేటర్స్ క్లోజ్ అయి ఉండటంతో సినిమా సందడి లేకుండా పోయింది. కాకపోతే డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ అంతో ఇంతో ప్రేక్షకులకు ఉపశమనం కలిగిస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఒరిజినల్ మూవీస్ - వెబ్ సిరీస్ లను అప్లోడ్ చేస్తూ వస్తున్న ఓటీటీలు.. లాక్ డౌన్ పుణ్యమా అని కొత్త సినిమాలను కూడా డైరెక్ట్ రిలీజ్ చేస్తున్నాయి. టాలీవుడ్ లో మొదట్లో చిన్న సినిమాలే ఓటీటీలో రిలీజ్ అయినప్పటికీ ఇప్పుడు క్రేజీ మూవీస్ ని కూడా డైరెక్ట్ ఓటీటీ విడుదల చేయడానికి ప్రొడ్యూసర్స్ ముందుకొస్తున్నారు. అయితే ఓటీటీలో విడుదలైన సినిమా రిజల్ట్ ని మాత్రం ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు.

థియేటర్స్ లో సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ వీక్ లో బాక్సాఫీస్ వద్ద అది కలెక్ట్ చేసిన వసూళ్లను బట్టి హిట్ - ప్లాప్ - యావరేజ్ అనేది నిర్ణయించేవారు. ఆ లెక్కలను ఏ సినిమా స్టామినా ఎంతో డిసైడ్ చేసేవారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. సినిమా హిట్ ప్లాప్ అని నిర్ణయించడానికి ప్రామాణికాలు లేవు. డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ లో విడుదలయ్యే సినిమాల విషయంలో కలెక్షన్స్ అనే మాట అసలు వినిపించదు. వ్యూయర్ షిప్ మాత్రమే ఆ సినిమా రేంజ్ ఏంటో తెలియజేస్తుంది. అయితే వ్యూయర్ షిప్ అనేది ఒక వారంలో నిర్ణయించేది కాదు. థియేటర్ లో సినిమా రిలీజైన నెక్స్ట్ డే దాని భవితవ్యం తెలిసిపోతుంది. కానీ ఓటీటీలో అది సాధ్యపడదు. దీని కారణంగా ఏ సినిమా బాగుంది ఏది బాగాలేదు అనే విషయాన్ని బేరీజు వేయలేకపోతున్నారు. దీనికి వల్ల ఓటీటీలో హిట్టు బొమ్మకి స‌రైన నిర్వ‌చ‌నం ఏంటనేది లేకుండా పోయింది.

నిజానికి థియేటర్స్ లో రిలీజ్ అయ్యే సినిమా ఎక్కువ కలెక్ట్ చేసి ప్రొడ్యూసర్స్ కి లాభాలు తెచ్చి పెడితే అది హిట్ బొమ్మ. అయితే ఇక్కడ ఓటీటీ విషయానికొస్తే సినిమా డైరెక్ట్ రిలీజ్ అవుతుందంట‌నే ప్రొడ్యూసర్స్ కమర్షియల్ గా లాభాల్లో ఉన్న‌ట్లే. మరి లాభాలు వచ్చాయి కదా హిట్ అందామా అంటే దానికి వ్యూయర్ షిప్ ఏమాత్రం వచ్చిందనేది తెలియదు. థియేటర్స్ లో సినిమాని ఎక్కువ మంది చూస్తే హిట్ గా పరిగణిస్తారు. కానీ ఓటీటీలో అలా కాదు. ఈ మధ్య ఓటీటీలో రిలీజైన తెలుగు సినిమాలు తీసుకుంటే.. మా సినిమా హిట్ మా సినిమా హిట్టు అని ప్రచారం చేసుకున్నారు. అయితే ఓ సినిమా హిట్ అయినప్పుడు దానికి పని చేసిన వారికి వరుస ఆఫర్స్ వస్తుంటాయి. కానీ ఆ మూవీస్ టీమ్ లో ఏ ఒక్క‌రు ఇంకో కొత్త సినిమా చేస్తున్నార‌ని క‌నీసం పుకారు కూడా రాలేదు. ఒక్క హీరో సత్యదేవ్ కి తప్ప లాక్ డౌన్ లో ఓటీటీ రిలీజులు ఏ ఒక్కరికీ ఉప‌యోగ‌ప‌డలేదు. ఏదో సినిమా రిలీజ్ అయింద‌నే సంతృప్తి త‌ప్పితే ఓటీటీలో రిలీజైన సినిమా కార‌ణంగా పెద్ద‌గా ఒరిగేది ఏమి లేదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి మేకర్స్ ప్రచారం చేస్తున్నట్లు ఆ సినిమాలు హిట్టు బొమ్మలేనా..?