Begin typing your search above and press return to search.

పేరులో ధ‌ర‌మ్ తీసేస్తే కూల్ ఎలా?

By:  Tupaki Desk   |   10 April 2019 5:30 PM GMT
పేరులో ధ‌ర‌మ్ తీసేస్తే కూల్ ఎలా?
X
స‌క్సెస్ లేన‌ప్పుడు సెంటిమెంటు అన్నిటినీ డామినేట్ చేయ‌డం చాలా స‌హ‌జం. ఫెయిల్యూర్ కి కార‌ణాలు విశ్లేషించుకునే క్ర‌మంలో జాత‌కం.. కుజ దోషం.. ముహూర్తం.. వ‌ర్జ్య ం..మంచి చెడు.. వ‌గైరా అంటూ చాలానే ఆలోచిస్తారు. మంచి జ్యోతిష్కుడిని క‌లిసి స‌ల‌హా అడుగుతారు. న్యూమ‌రాల‌జీ (సంఖ్యా శాస్త్రం) ని కూడా న‌మ్ముతారు. సెంటిమెంటు ప‌రిశ్ర‌మ టాలీవుడ్ లో ఇలా ఎంద‌రో ఎదురు ప‌డుతుంటారు. శాస్త్రాన్ని న‌మ్మితే.. పేరు మార్చుకుంటే.. లేదా పేరులో కొన్ని అక్ష‌రాల్ని తొల‌గించుకుంటే.. కొన్ని అక్ష‌రాల్ని త‌గిలించుకుంటే స‌క్సెస్ ద‌క్కి సుఖం పెరుగుతుంద‌నే న‌మ్మే హీరోల్ని .. ద‌ర్శ‌క‌నిర్మాత‌ల్ని డ‌జన్ల కొద్దీ టాలీవుడ్ లో చూపించ‌వ‌చ్చు. ఇప్ప‌టికే స‌క్సెస్ లేని ఎంద‌రో హీరోలు.. హీరోయిన్లు.. ద‌ర్శ‌క‌నిర్మాత‌లు వాళ్ల పేర్ల‌ను సంఖ్యాశాస్త్రం ప్ర‌కారం మార్పు చేసుకున్న సంద‌ర్భాలున్నాయి. అయితే కోట్లాది రూపాయ‌ల పెట్టుబ‌డుల‌తో కూడుకున్న వ్య‌వ‌హారం కాబ‌ట్టి సెంటిమెంటు అంతే బ‌లంగా డామినేట్ చేస్తుంద‌ని విశ్లేషించ‌వ‌చ్చు.

ప్ర‌స్తుతం మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ స‌న్నివేశం అందుకు మిన‌హాయింపు ఏమీ కాద‌ని అర్థ‌మ‌వుతోంది. ఒక‌టి కాదు.. రెండు కాదు.. కెరీర్ లో ఏకంగా ఆరు సినిమాలు ఫ్లాపుల‌య్యాయి. `పిల్లా నువ్వు లేని జీవితం` త‌ర్వాత స‌రైన హిట్టు అన్న‌దే లేదు. స‌క్సెస్ లేక‌పోతే చుట్టాలు, స్నేహితులు కూడా ద‌రికి రారు. ఎవ‌రో క్లోజ్ ఫ్రెండు అన్న ఒక‌రిద్ద‌రు త‌ప్ప త‌న‌ని ఇంకెవ‌రూ క‌ల‌వ‌డం లేద‌ని, ప‌ల‌క‌రించ‌డం లేద‌ని సాయిధ‌ర‌మ్ ఇదివ‌ర‌కూ ట్రైల‌ర్ - ప్రీరిలీజ్ వేడుక‌లో వాపోవ‌డంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. అదొక్క‌టే కాదు సాయిధ‌ర‌మ్ తేజ్ కాస్తా `సాయి తేజ్` అంటూ కొత్త‌గా పేరు మార్చుకున్నాడు. పేరులోంచి ధ‌ర‌మ్ ని తొల‌గించేశాడు. ఉన్న‌ట్టుండి స‌డెన్ గా ఏమైంది? ఎందుకిలా అంటూ అంద‌రికీ సందేహాలు క‌లిగాయి. కొంద‌రు మీడియా వాళ్లు అయితే అదేంటో అర్థంగాక సాయిధ‌ర‌మ్ అనే రాసేస్తున్నారు ఇంకా. మొత్తానికి ఏం జ‌రిగిందో కానీ సాయిధ‌ర‌మ్ నుంచి `ధ‌ర‌మ్` తీసేయ‌డం అభిమానుల్లో చ‌ర్చ‌కొచ్చింది. ధ‌ర్మాన్నే పేరు నుంచి తొల‌గిస్తార‌? అంటూ దీనిపై క‌న్ఫ్యూజ‌న్ అయిపోతున్నారంతా.

ఇదే ప్ర‌శ్న నేడు `చిత్రల‌హ‌రి` ప్ర‌మోష‌న‌ల్ ఇంట‌ర్వ్యూలో సాయిధ‌ర‌మ్ కి ఎదురైంది. సాయితేజ్‌ గారు ముందుగా మీ పేరు నుంచి `ధ‌ర‌మ్‌` ని ఎందుకు తొల‌గించారు? ఏదైనా న్యూమ‌రాల‌జీ ప్ర‌కార‌మా ఏదైనా జ్యోతిష్కుడి స‌ల‌హానా? అని తెలుగు మీడియా ప్ర‌శ్నించింది. దానికి అత‌డు అంతే కూల్ గా స‌మాధానం ఇచ్చాడు. ``సినిమా కొద్దిగా మంచి సినిమా క‌దా.. అందుకే కూల్‌ గా వెళ‌దామ‌ని.. హాయిగా ప్ర‌శాంతంగా ఉంటుంద‌ని అలా మార్చుకున్నా`` అని తెలిపారు. అయితే అది నా పేరు కాబ‌ట్టి నాతోనే ఉంటుంది అని తెలిపారు. అంటే `చిత్ర‌ల‌హ‌రి`పై సాయిధ‌ర‌మ్ ఎంత న‌మ్మ‌కం పెట్టుకున్నాడో అర్థం చేసుకోవ‌చ్చు. సాయిధ‌ర‌మ్ తేజ్ అనేది నాతో ఉంటుంది అని అన్నాడు కాబ‌ట్టి బ‌య‌టి వాళ్లు రాసేప్పుడు, పిలిచేప్పుడు సాయి తేజ్ అని పిలిస్తే చాలని తాను భావిస్తున్నాడ‌న్న‌మాట‌. అయితే సాయిధ‌ర‌మ్ తేజ్ అన్న సౌండింగ్ ముందు సాయి తేజ్ అన్న సౌండింగు కాస్తంత బోసిపోయిన‌ట్టుగా ఉంద‌ని అభిమానులు ఫీల‌వుతున్నారు. ఆ పేరులో ధ‌ర‌మ్ వ‌ల్ల‌నే గాంభీర్య ం క‌నిపిస్తోంది. ధ‌ర‌మ్ అంటే రేడియో ధార్మిక‌త .. అణు ధార్మిక‌త అంత ప‌వ‌ర్ ఫుల్ గా ఉంది సౌండింగ్. ప్ర‌పంచానికి శ‌క్తిని పంచేది ధార్మిక‌త‌. అది లేకుండా పేరు నుంచి తొల‌గించేయ‌డం ఫ్యాన్స్ కి ఏమాత్రం న‌చ్చ‌డం లేదు. మ‌రి చిత్ర‌ల‌హ‌రి రిలీజ్ త‌ర్వాత ఫ‌లితాన్ని బ‌ట్టి అయినా సుప్రీం హీరో పేరు మార్పుపై పున‌రాలోచిస్తాడేమో చూడాలి!! పేరు నుంచి ధ‌ర‌మ్ తీసేస్తే స‌క్సెస్ ద‌క్కుతుందా? కూల్ అవుతాడా? అన్నిటికి ఏప్రిల్ 12న‌ స‌మాధానం దొరుకుతుతంద‌న్నమాట‌!