Begin typing your search above and press return to search.
డాల్బీ విజన్ 3డి గ్లాసెస్ లో పండోరా ఎలా కనపించనుంది?
By: Tupaki Desk | 15 Dec 2022 11:30 AM GMTఅవతార్ 2 డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అసాధారణమైన ప్రీరిలీజ్ బిజినెస్ చేయడంతో వ్యాపార వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. హైదరాబాద్ సహా ఇరు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కోసం భారీ మొత్తాలు వెచ్చించిన తెలుగు రాష్ట్రాల పంపిణీదారుల్లోను బోలెడంత ఉత్కంఠ నెలకొంది. ఈ సినిమా తెలుగు స్టార్ హీరోల ను మించిన భారీ ఓపెనింగులతో ప్రారంభమవుతుందని అంతా అంచనా వేస్తున్నారు.
ఇప్పుడు హైదరాబాద్ లోని సినీ ప్రియులకు ఓ శుభవార్త. అవతార్ 2 భారీ స్క్రీన్ స్క్రీనింగ్ లో వీక్షకులకు ప్రత్యేక 3డి గ్లాసెస్ ఇవ్వనున్నట్లు హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ పెద్ద స్క్రీన్ వర్గాలు ప్రకటించాయి. ఇవి ప్రత్యేకంగా రూపొందించిన డాల్బీ విజన్ 3డి గ్లాసెస్ అని తెలిసింది. సినిమా వీక్షణ అనుభవాన్ని మహదాద్భుతంగా పెంచే ఖ్యాతి ఈ గ్లాసెస్ కి ఉంది. కాబట్టి ఈ ప్రత్యేక సౌకర్యం సినీ ప్రేమికులను మరింత ఉత్కంఠగా వేచి చూసేలా చేస్తోంది.
ఐమ్యాక్స్ లో అవతార్ చిత్రం దాదాపు 150 రోజులు పైగా ఆడింది. ఇప్పుడు సీక్వెల్ ఏ స్థాయిలో ఆడుతుందో చూడాలి. హైదరాబాద్ సహా విశాఖపట్నం-తిరుపతి-రాజమండ్రి- విజయవాడ-కరీనంగర్- వరంగల్ వంటి చోట్ల అవతార్ థియేటర్లకు ఫుల్ ఫ్లోటింగ్ కనిపిస్తోందని సమాచారం. అవతార్ కేవలం మెట్రోల్లోనే కాకుండా ఇటు టూటైర్ సిటీల్లోను వసూళ్ల హవా సాగించడం ఖాయంగా కనిపిస్తోందని ట్రేడ్ విశ్లేషిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి- బాలకృష్ణ సినిమాలకు లేని హైప్ ఈ సినిమాకి కనిపిస్తోందని ప్రముఖ ఉత్తరాంధ్ర పంపిణీదారు వ్యాఖ్యానించడం ఆసక్తికరం.
ఆస్కార్ దర్శకుడి మొదటి రివ్యూ
2022 మోస్ట్ అవైటెడ్ పాన్ వరల్డ్ మూవీ 'అవతార్ 2' మొదటి సమీక్ష ఇప్పటికే వచ్చేసింది! ఆస్కార్ గ్రహీత.. దర్శకుడు గిల్లెర్మో డెల్ టోరో స్పందన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అకాడమీ అవార్డ్ విజేత.. దర్శకుడు గిల్లెర్మో డెల్ టోరో 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' మొట్టమొదటి సమీక్షను సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసారు. దీంతో అవతార్ అభిమానుల్లో మరింత ఉత్కంఠ పెరిగింది. జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన చిత్రం అవతార్ 2 డిసెంబర్ 16న థియేటర్లలో విడుదల కానుండగా గిల్లెర్మో రివ్యూ ఒక్కసారిగా హీట్ ని పెంచింది. అవతార్ 2 చిత్రాన్ని ఇప్పటికే గిల్లెర్మో వీక్షించారు. ఈ చిత్రంపై తన మొదటి సమీక్షను షేర్ చేయగానే అది వైరల్ గా మారింది. వెంటనే ఈ సినిమాని 3డి విజువల్స్ లో చూడాలన్న కుతూహాలాన్ని మరింతగా పెంచింది. అతను ఇలా రాసారు. "అత్యద్భుతమైన విజయం.. అవతార్ 2 గంభీరమైన .. భావోద్వేగాలతో కూడుకున్న గొప్ప సినిమా. ఇది పురాణేతిహాసాన్ని చూస్తున్నంతగా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది" అని ప్రశంసించారు. అతడు శక్తుల శిఖరాగ్రంలో ఒక మాస్టర్...అంటూ కామెరూన్ పైనా ప్రశంసల జల్లు కురిపించారు. అవతార్ 2 మొదటి సమీక్షపై అభిమానులు స్పీడ్ గానే స్పందించారు "ఇది రాజ ముద్ర" అని "ఆమోద ముద్ర" అని వ్యాఖ్యల్ని జోడించారు.
గిల్లెర్మో డెల్ టోరో ఈ చిత్రం వీక్షించిన అనంతరం ప్రశంసలు కురిపించారు. నిజానికి 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' వర్క్ ఎట్టకేలకు పూర్తయిందని నిర్మాత జోన్ లాండౌ నవంబర్ 24న ట్విట్టర్ లో ప్రకటించారు. సినిమాకి సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అని రాశారు. దర్శకుడు గిల్లెర్మో డెల్ టోరో ఈ ప్రకటనపై ప్రతిస్పందించారు. చిత్రంపై తన మొట్టమొదటి సమీక్షను పంచుకుని మరింత ఉత్కంఠను పెంచారు. గిల్లెర్మో డెల్ టోరో హాలీవుడ్ లో సంచలన చిత్రాలను తెరకెక్కించిన మేధావి. ది షేప్ ఆఫ్ వాటర్- నైట్ మేర్ అల్లే-పాన్స్ లాబ్రింత్ వంటి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. వచ్చే నెల ప్రారంభంలో తన తదుపరి చిత్రం 'పినోచియో' విడుదల కోసం వేచి చూస్తున్నాడు. అతడు తన తరంలో గొప్ప దృశ్య కథకులలో ఒకరిగా కూడా గుర్తింపు పొందారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.