Begin typing your search above and press return to search.
హృతిక్ వల్లనే బడ్జెట్ భారీగా పెరిగిపోయిందట!
By: Tupaki Desk | 30 Jun 2022 2:30 AM GMTతమిళనాట 2017లో వచ్చిన భారీ హిట్ చిత్రాలలో 'విక్రమ్ - వేద' ఒకటి. మాధవన్ - విజయ్ సేతుపతి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. కేవలం 11 కోట్లతో నిర్మించిన ఈ సినిమా అక్కడ 60 కోట్లను వసూలు చేసింది. వివిధ భాషలకి చెందిన మేకర్స్ ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం పోటీపడ్డారు.
బాలీవుడ్ లో ఈ సినిమాను బడా బ్యానర్లు కలిసి నిర్మిస్తున్నాయి. తమిళంలో ఈ సినిమాను తెరకెక్కించిన పుష్కర్ - గాయత్రి, హిందీలోను దర్శకత్వం వహించారు. ప్రధానమైన పాత్రల్లో హృతిక్ రోషన్ - సైఫ్ అలీఖాన్ నటించారు.
పుష్కర్ - గాయత్రికి ఈ కథపై పూర్తి పట్టు ఉండటం వలన, బడ్జెట్ తమ అదుపులోనే ఉంటుందని భావించారట. ఈ సినిమా కోసం అవసరమైన సెట్స్ ను ఉత్తరప్రదేశ్ లో వేయాలనే ఒక నిర్ణయానికి వచ్చారట. అయితే హృతిక్ మాత్రం దుబాయ్ లో సెట్ వేయాలని పట్టుబట్టాడట.
ఈ విధంగా చేయడం వలన ఈ సినిమా బడ్జెట్ భారీగా పెరిగిపోయిందని అంటున్నారు. ఇక షెడ్యూల్స్ లో అనుకోని మార్పులు జరగడం కూడా బడ్జెట్ పై ఎఫెక్ట్ చూపిందని చెబుతున్నారు.
ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా సైఫ్ అలీఖాన్ నటించగా, గ్యాంగ్ స్టర్ పాత్రలో హృతిక్ రోషన్ కనిపించనున్నాడు. ఈ ఇద్దరి క్రేజ్ ను .. వారికి గల మార్కెట్ ను దృష్టిలో పెట్టుకునే ఒక బడ్జెట్ అనుకున్నారట. అయితే అది కాస్తా ప్లానింగ్ మార్పువలన పెరిగిపోయిందని అంటున్నారు.
తమిళంలో మాదిరిగానే హిందీలోను ఈ సినిమా 'విక్రమ్ - వేద' టైటిల్ తోనే రూపొందుతుండటం విశేషం. సెప్టెంబర్ 30వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. మరి బాలీవుడ్ లో ఈ సినిమా ఏ స్థాయి వసూళ్లను రాబడుతుందనేది చూడాలి.