Begin typing your search above and press return to search.

కామెంట్‌: కండలవీరులు తల పట్టుకోవాల్సిందే

By:  Tupaki Desk   |   14 July 2015 3:43 AM GMT
కామెంట్‌: కండలవీరులు తల పట్టుకోవాల్సిందే
X
తొలిప్రేమ' సినిమాను వదిలేసినందుకు సుమంత్‌, 'పోకిరి'ని ఒప్పుకోనందుకు రవితేజ, 'ఊసరవెల్లి' చేయనందుకు రామ్‌.. ఫీలవుతూనే ఉంటారు. ఈ సినిమాలు సదరు నిర్మాతలకు ఎన్ని కాసులు మిగిల్చాయ్‌ అనే దానికంటే ఇవి సదరు హీరోల కెరియర్లను అమాంతం విష్ణు చక్రంతో సాయంతో తిప్పేసి స్వరధామంలో పడేశాయ్‌. ఒక్కోసారి పేపర్‌ మీద కథను చదివాక.. అబ్బో ఏముందిలే అనిపిస్తుంది. కాని దానినే తెరపైన చూశాక.. అరే ఈ క్లాసిక్‌ను నేను మిస్‌ జడ్జ్‌ చేసి మిస్‌ చేసుకున్నానే అంటూ తల పట్టుకోవాల్సి వస్తుంది.

సరిగ్గా ఇప్పుడు 'బాహుబలి' సినిమా విషయంలో కూడా అలాంటి సీన్లే కొన్ని చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా మిల్కీ బ్యూటి తమన్నా పాత్ర కోసం మనోళ్ళు ముందుగా శృతి హాసన్‌, ఆ తరువాత సమంతలను ఎప్రోచ్‌ అయ్యారు. కాని శృతి ఆల్రెడీ రాఘవేంద్రరావు టీములోనే అనగనా ఓ ధీరుడు సినిమాలో ఇలాంటి యువరాణి సోయగాలున్న రోల్‌ చేసింది కాబట్టి ఆమె వద్దనుకుంది. ఇక సమంతకు డేట్స్‌ కుదర్లేదట. కట్‌ చేస్తే సినిమాల్లేని మిల్కీకి ఆఫర్‌ వచ్చేసింది. అవంతికగా ప్రూవ్‌ చేసుకుంది. ప్రశంసలు అందుకుంటోంది. 'బాహుబలి' సినిమా సక్సెస్‌ను, కలెక్షన్ల రేంజ్‌ను, ప్రశంసల జడివానను చూసినప్పుడల్లా ఇక శృతి, స్యామ్‌లు ఫీలవ్వాల్సిందే. వీరే కాదు, ఈ లిస్టులో ఓ ఇద్దరు కండలవీరులు కూడా ఉన్నారు.

సౌత్‌కు ప్రభాస్‌, రానా సరిపోయినా కూడా.. సినిమా నార్త్‌లో ఆడాలంటే బాలీవుడ్‌ బాబులు ఉంటే బెటరేమోనని రాజమౌళి ఓ ఇద్దరికి కథ చెప్పాడట. వారే హృతిక్‌ రోషన్‌, జాన్‌ అబ్రహామ్‌లు. ఒకరు బాహుబలి, ఒకరు బల్లాలదేవ అనుకున్నారట. కాని కథ పేపర్లను పట్టుకెళ్ళిన హృతిక్‌, జాన్‌లు తిరిగి కాల్‌ చేస్తే ఒట్టు. కనీసం వాట్సాప్‌ కూడా చెయ్యలేదు. దానితో జక్కన్న మన బాబులతోనే హిందీ వర్షెన్‌ కూడా లాగించేశాడు. జస్ట్‌ మనోళ్ళు చేస్తేనే సినిమా మూడు రోజుల్లో 25 కోట్ల పైన గ్రాస్‌ వసూలు చేసింది. అదే హృతిక్‌ చేసుంటే? విలన్‌గా జాన్‌ గధ విసిరుంటే? రికార్డులు లెక్కెట్టడానికి ఖాన్స్‌ తాలూకు ఫ్యాన్స్‌ అందరూ రావాల్సొచ్చేది. ఇప్పుడు ఈ బాలీవుడ్‌ బాబుల ఫీలింగ్స్‌ ఎలా ఉండి ఉంటాయంటారు?