Begin typing your search above and press return to search.

హృతిక్ రోష‌న్.. ప్ర‌పంచంలో మూడోవాడు

By:  Tupaki Desk   |   25 Nov 2016 1:30 PM GMT
హృతిక్ రోష‌న్.. ప్ర‌పంచంలో మూడోవాడు
X
ఇండియాలో మోస్ట్ హ్యాండ్స‌మ్ సినీ హీరోల్లో హృతిక్ రోష‌న్ ఒక‌డ‌న‌డంలో సందేహం లేదు. గ‌తంలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత‌డికి ఎన్నో స‌ర్వేలు ప‌ట్టం క‌ట్టాయి. తాజాగా ప్ర‌క‌టించిన ప్ర‌పంచ అంద‌గాళ్ల జాబితాలో హృతిక్ కు మూడో స్థానం ద‌క్క‌డం విశేషం. చాలామంది హాలీవుడ్ హీరోల్ని వెన‌క్కి నెట్టి మోస్ట్ హ్యాండ్స‌మ్ మెన్ లిస్టులో మూడో స్థానం ద‌క్కించుకున్నాడు. ఈ జాబితాలో ‘మిష‌న్ ఇంపాజిబుల్’ హీరో టామ్ క్రూయిజ్ అగ్ర‌స్థానం సాధించాడు. ‘ట్విలైట్ క‌థానాయ‌కుడు రాబ‌ర్ట్ ప్యాటిన్స‌న్ రెండో స్థానంలో నిలిచాడు.

ఈ జాబితాలో మ‌రో ఇండియ‌న్ సూప‌ర్ స్టార్ స‌ల్మాన్ ఖాన్ కూడా టాప్‌-10లో చోటు ద‌క్కించుకున్నాడు. ఈ కండ‌ల వీరుడు ఏడో స్థానంలో నిల‌వ‌డం విశేషం. ‘పైరేట్స్ ఆఫ్ ద క‌రేబియ‌న్’ హీరో జానీ డెప్ నాలుగో స్థానంలో నిల‌వ‌గా.. బ్రాడ్ పిట్ కు ఎనిమిదో స్థానం ద‌క్కింది. ‘ఎక్స్ మెన్’ సిరీస్ తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న జాక్ మ‌న్ తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఆన్ లైన్ పోల్ ద్వారా ఈ మోస్ట్ హ్యాండ్స‌మ్ మెన్ లిస్టును ప్ర‌క‌టించ‌డం విశేషం. ఎంతోమంది హాలీవుడ్ హీరోల‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా పాపులారిటీ ఉన్నా.. వాళ్ల‌ను వెన‌క్కి నెట్టి టాప్-10 మ‌న హీరోలు ఇద్ద‌రికి చోటు ద‌క్కించుకోవ‌డం గొప్ప విష‌య‌మే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/