Begin typing your search above and press return to search.

జ‌క్క‌న్న‌ని ఆడేసుకుంటున్న హృతిక్ ఫ్యాన్స్‌!

By:  Tupaki Desk   |   3 Jan 2023 11:47 AM GMT
జ‌క్క‌న్న‌ని ఆడేసుకుంటున్న హృతిక్ ఫ్యాన్స్‌!
X
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ల తొలి క‌ల‌యిక‌లో రాజమౌళి తెర‌కెక్కించిన పాన్ ఇండియా వండ‌ర్ `RRR`. ఈ మూవీతో వ‌ర‌ల్డ్ వైడ్ గా సంచ‌ల‌నం సృష్టించిన జ‌క్క‌న్న ఇప్ప‌టికే ప‌లు అంత‌ర్జాయ వేదిక‌ల‌పై పాపుల‌ర్ అవార్డుల్ని ద‌క్కించుకున్నాడు. త్వ‌ర‌లో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ కు ఈ మూవీ నామినేట్ కావ‌డం. ఆస్కార్ అవార్డుల్లోనూ ఈ సినిమాని షార్ట్ లిస్ట్ చేయ‌డం తెలిసిందే. `నాటు నాటు` సాంగ్ కు గానూ ఆస్కార్ కు `RRR` షార్ట్ లిస్ట్ కావ‌డంతో అభిమానులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

ఇదిలా వుంటే ఈ మూవీని ఈ నెల 9న లాస్ ఏంజెల్స్ లోని బిగ్ స్క్రీన్ ఐమాక్స్ టీఎల్సీ చైనీస్ థియేట‌ర్ లో ప్ర‌త్యేకంగా స్క్రీనింగ్ చేయ‌బోతున్నారు. ఇందు కోసం రాజ‌మౌళితో పాటు రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ అంత‌ర్జాతీయ మీడియా ముందుకు రాబోతున్నారు. ఇంత‌గా జ‌క్క‌న్న ఇంటర్నేష‌న‌ల్ గా వైర‌ల్ అవుతున్న వేళ బాలీవుడ్ హీరో హృతిక్ రోష‌న్ అభిమానులు నెట్టింట ట్రోల్ చేస్తుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇందుకు రాజ‌మౌళి చేసిన వ్యాఖ్య‌లే కార‌ణంగా తెలుస్తోంది.

వివ‌రాల్లోకి వెళితే... 2008లో ప్ర‌భాస్ హీరోగా మెహ‌ర్ ర‌మేష్ తెర‌కెక్కించిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `బిల్లా`. ఈ మూవీ ట్రైల‌ర్‌ రిలీజ్ ఫంక్ష‌న్ సాక్షిగా హృతిక్ రోష‌న్ తో ప్ర‌భాస్ కి అస‌లే పోలిక లేదంటూ రాజ‌మౌళి చేసిన వ్యాఖ్య‌లు అప్ప‌ట్లో వైర‌ల్ అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియోని తాజాగా హృతిరోష‌న్ అభిమానులు నెట్టింట ట్రెండ్ చేస్తూ రాజ‌మౌళిని ట్రోల్ చేస్తున్నారు. త‌మ హీరోతో ప్ర‌భాస్ ని పోల్చ‌డం త‌మ‌కు న‌చ్చ‌లేద‌ని జ‌క్క‌న్న‌పై మండిప‌డుతున్నారు.

`రెండేళ్ల క్రితం `ధూమ్ 2` రిలీజ్ అయింది. ఆ మూవీ చూశాక బాలీవుడ్ వాళ్లు మాత్ర‌మే ఎందుకు ఈ త‌రహా క్వాలిటీ మూవీస్ చేస్తున్నారా? అని వండ‌ర్ అయ్యాను. హృతిక్ రోష‌న్ లాంటి హీరోలు మ‌న‌కు లేరా?.. `బిల్లా` పోస్ట‌ర్, సాంగ్‌, ట్రైల‌ర్ చూశాక నాకు అనిపించింది.

ప్ర‌భాస్ ముందు హృతిక్ రోష‌న్ న‌థింగ్ అని. తెలుగు సినిమాని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లిన మెహ‌ర్ ర‌మేష్ కు విష‌యంలో థ్యాంక్స్ చెబుతున్నాను` అని రాజ‌మౌళి అన్నారు. కొనేళ్ల క్రితం జ‌క్క‌న్న అన్న మాట‌ల‌కు సంబంధించిన ఈ వీడియోని ఇప్పుడు హృతిక్ అభిమానులు నెట్టింట వైర‌ల్ చేస్తూ జ‌క్క‌న్న‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

అయితే తెలుగు ఫ్యాన్స్ మాత్రం ఎప్పుడో అన్న వీడియోని ప‌ట్టుకుని ఇప్పుడు రార్థాంతం చేస్తున్నారేంట్రా బాబూ అంటూ కామెంట్ లు చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ గా మారింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.