Begin typing your search above and press return to search.

ఇండియన్ సూపర్ హీరో క్రియేటర్..వెడ్డింగ్ యానివర్సరీ సెలెబ్రేషన్స్

By:  Tupaki Desk   |   25 April 2020 10:50 AM GMT
ఇండియన్ సూపర్ హీరో క్రియేటర్..వెడ్డింగ్ యానివర్సరీ సెలెబ్రేషన్స్
X
బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్‌ రోషన్‌ తన మాజీ భార్య సుసానేతో కలిసి తన పేరెంట్స్ రాకేష్‌ రోషన్‌, పింకి రోషన్‌లకు వెడ్డింగ్ డే శుభాకాంక్షలు తెలిపుతున్న వీడియోను సోషల్‌ మీడియాలో ఇటీవలే షేర్‌ చేశాడు. ఏప్రిల్ 22న రాకేష్‌, పింకి రోషన్‌ల వివాహ వార్షికోత్సవం సందర్భంగా హృతిక్‌ తన ఇద్దరు పిల్లలు, మాజీ భార్యతో కలిసి శుభాకాంక్షలు తెలిపిన మూడు వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ‘బయట ఉన్నా.. క్వారంటైన్‌లో ఉన్నా.. మన ఆత్మలు ఎప్పుడు డ్యాన్స్‌ చేయాల్సిందే..! హ్యాపీ యానివర్సరీ మమ్మ, పప్పా, లవ్‌ యూ’ అనే క్యాప్షన్‌కు ‘‘ఫ్యామిలీ స్పీరిట్‌’’ అనే హ్యాష్‌ ట్యాగ్‌ కు జత చేసి షేర్‌ చేశాడు హృతిక్. ఒక వీడియో లో హృతిక్‌ పియానో వాయిస్తుంటే తన ఇద్దరు కొడుకులు హ్రేహాన్‌, హ్రిధాన్‌లతో పాటు భార్య సుసానే శుభాకాంక్షలు తెలుపుతూ పాట పాడుతున్నారు.

ఇక మరో వీడియోలో హృతిక్‌ తల్లిదండ్రులు రాకేష్‌, పింకి రోషన్‌లు కేక్‌ కట్‌ చేస్తుంటే కుటుంబ సభ‍్యులంతా వీడియో కాల్‌లో శుభకాంక్షలు తెలుపుతున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇదిలా ఉండగా చిన్నప్పటీ నుంచి మంచి స్నేహితులైన హృతిక్‌, సుసానేలు 2000 సంవత్సరం లో పెళ్లి చేసుకున్నారు. అయితే ఓ స్టార్‌ హీరోయిన్‌ వల్ల వీళ్ళ వివాహబంధంలో కలతలు వచ్చాయట. అందుకే 2014లో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి దూరంగా ఉంటున్న హృతిక్, సుసానేలు లాక్‌డౌన్‌ కారణంగా కలిసి ఉండటం ఆనందంగా ఉందని అభిమానులు అంటున్నారు.