Begin typing your search above and press return to search.
స్టార్ హీరో ఇంట విషాదం..సినీ పెద్దాయన కన్నుమూత
By: Tupaki Desk | 7 Aug 2019 7:45 AM GMTబాలీవుడ్ లెజెండరీ ఫిలిం మేకర్ జే.ఓం ప్రకాశ్ (93) ఈ రోజు (బుధవారం) కన్నుమూశారు. ఆయన పేరు ఈ తరానికి తెలియకపోవచ్చు. ఆయన ఎవరన్న విషయం ఇట్టే అర్థం కావాలంటే.. గ్రీక్ గాడ్ గా అభివర్ణించే బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తాతే జే.ఓం. ప్రకాశ్.
దాదా - ఆప్ కే సాథ్ - ఆఖిర్ క్యోం - అర్పణ్ - ఆస్ పాస్ - ఆశ - ఆక్రమణ్ - ఆప్ కీ కసమ్ వంటి ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాల్ని తీశారు. ఆంధీ - ఆంఖో ఆంఖో మే - ఆయా సవాన్ ఝూమ్ కే వంటి చిత్రాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. ఆయన మరణంపై బాలీవుడ్ ప్రముఖులు పలువురు తమ సంతాపాన్ని తెలియజేశారు. ఇటీవల హృతిక్ తన తాత గురించి ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. ఆయనతో తనకున్న అనుబంధాన్ని తెలియజేశారు.
తన తాత తనకు సూపర్ టీచర్ అని.. జీవితంలో ప్రతి దశలో ఆయన ఎలా ఉండాలో తనకు పాఠాలు నేర్పించారన్నారు. బలహీనతల్ని ఎలా అధిగమించాలో చెప్పిన ఆయన మాటలతో తాను రాటు తేలినట్లుగా చెప్పారు. గత ఏడాది తన తాత బర్త్ డే సందర్భంగా ఇన్ స్టాలో ఆయన గురించి పలు విషయాల్ని రాసుకొచ్చారు.
యువకుడిగా ఉన్న దశలో తన తాత పుస్తకాలు కొనేందుకు వెడ్డింగ్ రింగ్ ను అమ్మేశారని.. వీధి దీపాల కింద చదువుకొని సినిమాల్లోకి వచ్చారన్నారు. సృజనాత్మకతతో అత్యున్నత స్థాయికి ఎదిగారన్నారు. బాలీవుడ్ సినీ పెద్దాయనగా భావించే జేఓం. ప్రకాశ్ మరణంపై పలువురు చిత్ర పరిశ్రమ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేశారు.