Begin typing your search above and press return to search.
బెడ్‌రూమ్ పడగొట్టించి జిమ్ము కట్టేశాడా...
By: Tupaki Desk | 13 Aug 2015 4:00 AM ISTకండల హీరో హృతిక్ రోషన్ కొత్త అపార్ట్ మెంట్ లోకి మారాడు. అతడు మునుపు ఉన్న రెసిడెన్స్ కి దగ్గరలోనే ఈ కొత్త అపార్ట్‌మెంట్. ఇది సముద్రానికి ఎదురుగా ఫేసింగ్ ఉన్న విశాలమైన అపార్ట్ మెంట్. ఇందులో ఏకంగా నాలుగు బెడ్ రూమ్ లు ఉన్నాయి. అయితే అందులోంచి ఓ బెడ్ రూమ్ ని పగుల గొట్టి .. దానికి అలాచ్డ్ గా జిమ్ ని సెట్ చేశాడు.
వాస్తవానికి అందులో సెట్ చేసిన జిమ్ము విశాలంగా లేకపోవడంతో హృతిక్ దాన్ని మాడిఫై చేయించాడట. ఒకటి పడగొట్టించాడు కాబట్టి వేరే రెండు బెడ్ రూమ్ లలో ఒకటి తను ఉపయోగించుకుంటే, మిగిలినది తన పిల్లలకి కేటాయించాడుట. అతడి ఇద్దరు బిడ్డలు రిహాన్, హృదాన్‌లకు కావాల్సిన ఏర్పాట్లన్నీ ఈ కొత్త అపార్ట్ మెంట్ లో ఉన్నాయి.
భార్య సుజానే ఖాన్ కి విడాకులిచ్చాక హృతిక్ ఇప్పటికీ బ్యాచిలర్ గానే ఉండిపోయాడు. ప్రేమ పల్లవించలేదు. మనసు పరవశించలేదు. ఈ కండల బాబుని ఇంప్రెస్ చేసే వేరే మగువ ఎవరకూ కనిపించలేదింత వరకూ. అందుకే బ్యాచిలర్ షిప్ లో జిమ్ముకి ఉన్న అవసరం బెడ్ రూమ్ కి ఉండదు కదా! అనుకుని పడగొట్టించాడేమో?