Begin typing your search above and press return to search.

అల్లు రాముడిగా కండల వీరుడా ?

By:  Tupaki Desk   |   1 Aug 2019 9:22 AM GMT
అల్లు రాముడిగా కండల వీరుడా ?
X
కొంత కాలం క్రితం అల్లు అల్లు అరవింద్ వెయ్యి కోట్లకు పైగా బడ్జెట్ తో త్రీడి రామాయణం ప్రకటించిన సంగతి తెలిసిందే. అనౌన్స్ మెంట్ అయితే వచ్చింది కాని నిజంగా ఇది కార్యాచరణలోకి వస్తుందా అన్న అనుమానాలు ఫిలిం నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొట్టాయి. అయితే ఇన్ సైడ్ టాక్ ప్రకారం దీనికి సంబంధించిన క్యాస్టింగ్ కోసం ప్రస్తుతం వర్క్ జరుగుతున్నట్టుగా సమాచారం.

ఇందులో రాముడిగా కండల వీరుడు హృతిక్ రోషన్ ను తీసుకుంటే ఎలా ఉంటుందా అనే కోణంలో చర్చలు జరుగుతున్నట్టుగా ముంబై వర్గాల సమాచారం. జోదా అక్బర్ - మొహెంజొదారో లాంటి హిస్టారికల్ మూవీస్ లో నటించిన అనుభవం ఉన్న హృతిక్ రాముడు లాంటి ఇతిహాసపు పాత్ర ఎలా చేస్తాడన్న ఆసక్తి కలగడం సహజం. ఇది అధికారికంగా ప్రకటించాకే ఓ కంక్లూజన్ కు రాగలం

ఇటీవలే సూపర్ 30తో మెప్పించిన హృతిక్ అక్టోబర్ లో భారీ యాక్షన్ మూవీ వార్ ద్వారా తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించబోతున్నాడు. ఒకవేళ నిజంగానే రాముడి పాత్ర ఓకే అయితే అంతకన్నా అభిమానులకు కావాల్సింది ఏముంది. వాస్తవానికి ఇంత భారీ బడ్జెట్ తో తీస్తున్నప్పుడు పాన్ ఇండియా హీరోలే కావాలి. అప్పుడే వర్క్ అవుట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అల్లు అరవింద్ తో పాటు మధు మంతెన నమిత్ మల్హోత్రా నిర్మాతలుగా వ్యవహరిస్తారు.. నితేష్ తివారి - రవి ఉద్యావర్ జంటగా దర్శకత్వం వహించబోయే ఈ మూవీ రెగ్యులర్ షూట్ కు ఇవన్ని ఫైనల్ అయ్యాకే వెళ్తుంది